Turkey Earthquake: టర్కీ భూకంపంతో గల్లంతైన భారతీయుడి మృతదేహం లభ్యం..

మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ వారం టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటి నుండి 36 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు.

Turkey Earthquake: టర్కీ భూకంపంతో గల్లంతైన భారతీయుడి మృతదేహం లభ్యం..
Turkey Earthquake F
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 11, 2023 | 8:09 PM

టర్కీ భూకంపంలో అదృశ్యమైన భారతీయుడి మృతదేహం లభ్యమైంది ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్ కుమార్ (35) మృతదేహం లభించింది.. బహుళ అంతస్తుల హోటల్ భవనం కుప్పకూలడంతో విజయ్ కుమార్ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ వారం టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటి నుండి 36 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. కొండ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం టర్కీకి వెళ్లాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. ఆగ్నేయ టర్కీలోని అంటక్యాలో ధ్వంసమైన భవనాల నుండి క్రేన్లు శిధిలాలను తొలగిస్తున్నాయి. రెస్క్యూ బృందాలు శిథిల భవనాల కింద చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం వెతుకుతున్నాయి.

సోమవారం తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపం టర్కీ, సిరియాను వణికించింది. మధ్యాహ్నం వచ్చిన మరో భీకర భూకంపానికి ఈ రెండు దేశాలూ మరోసారి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రకృతి బీభత్సానికి వేలల్లో ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో.. ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు ప్రాణాలతో బయటపడడం సంచలనంగా మారింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. టర్కీలో సంభవించిన భూప్రళయంలో ఈ శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు.

ఈ చిన్నారి పేరు యాగిజ్‌ ఉలాల్‌. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బందికి సిమెంట్ పెళ్లల మధ్య నుంచి చిన్న శబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. చిన్నారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిని కూడా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. హతయ్‌ ప్రావిన్సులో భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గడ్డకట్టే చలిలోనూ నిరంతరం శ్రమిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!