Trending Video: చెంపపై కొట్టి.. ఆపై ప్రేమతో బుగ్గపై ముద్దు పెట్టి.. సోషల్ మీడియాను ఊపేస్తున్న క్యూట్ వీడియో..
బాల్యం ఎంతో మధురం. కల్లాకపటం తెలియని వయసులో, స్వచ్ఛమైన మనసుతో చేసే స్నేహం, అల్లరి.. చిరకాలం గుర్తుండిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం దొరికితే మళ్లీ తమ బాల్యపు రోజులు..
బాల్యం ఎంతో మధురం. కల్లాకపటం తెలియని వయసులో, స్వచ్ఛమైన మనసుతో చేసే స్నేహం, అల్లరి.. చిరకాలం గుర్తుండిపోతాయి. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం దొరికితే మళ్లీ తమ బాల్యపు రోజులు వస్తే బాగుండు అనుకుంటారు. నిజానికి.. చిన్న వయసులో చేసే స్నేహాలు.. మంచి ప్రయోజనం కలిగిస్తాయి. ఒకరినొకరు కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. మళ్లీ కాసేపయ్యాక అంతా మర్చిపోయి కలిసిపోతారు. కలిసిమెలిసి ఆడుకుంటారు. నువ్వు, నేను అనే తేడా లేకుండా మనం అనే కాన్సెప్ట్ తో ఉంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. వాటిని ఒకసారి మాత్రమే కాకుండా మాటిమాటికి చూసేందుకు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. కొందరు చిన్నారులు బెంచీపై కూర్చుని ఉండటాన్ని చూడవచ్చు. అక్కడ ఉన్న ఓ చిన్నారి.. తమ పక్కన కూర్చున్న బుడతడిని ఇబ్బంది పెదుతుంది. చెంపపై కొడుతుంది. మోచేత్తో పొట్టపై కొడుతుంది. ఆ తర్వాత క్యూట్ గా చెంపపై ముద్దులు పెడుతుంది. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆ బాలుడు.. అలా చేయకూడదని కంటితో సైగ చేస్తాడు. దీంతో కొంత సమయం ఆగి.. మళ్లీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అయినా.. ఆ పిల్లవాడు ఏ మాత్రం చలించకుండా టీచర్ చెప్పే పాఠాన్ని ఇంట్రెస్టింగ్ గా వినడాన్ని వీడియోలో చూడవచ్చు.
View this post on Instagram
ఈ ఫన్నీ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. వీడియోకు ఇప్పటివరకు 14 మిలియన్ కు పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన ప్రజలు రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..