Video: వామ్మో.. సూపర్‌మ్యాన్‌కే సుస్సు పోయించావుగా.. కష్టమైన క్యాచ్ కోసం కళ్లుచెదిరే డైవింగ్.. వైరల్ వీడియో..

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ అద్భుత క్యాచ్ పట్టి, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు.

Video: వామ్మో.. సూపర్‌మ్యాన్‌కే సుస్సు పోయించావుగా.. కష్టమైన క్యాచ్ కోసం కళ్లుచెదిరే డైవింగ్.. వైరల్ వీడియో..
Bpl Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Feb 11, 2023 | 6:28 PM

పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన బ్యాటింగ్‌తోనే కాదు.. వికెట్ కీపింగ్‌లోనూ పేరు తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న బీపీఎల్‌లో మరోసారి తన అద్భుత వికెట్‌కీపింగ్ స్కిల్స్‌ను అభిమానులకు చూపించాడు. అతను పట్టుకున్న ఓ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రిజ్వాన్ ఈ అద్భుతమైన క్యాచ్ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్‌మ్యాన్ అని పిలుస్తున్నారు. మరికొందరు జిమ్నాస్ట్‌ అంటూ కామెంట్లు చేస్తు్నారు. ఈ మ్యాచ్‌లో అతను బ్యాట్‌తో అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ, వికెట్ కీపింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రిజ్వాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ టీ20 లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ తరపున ఆడుతున్నాడు. శుక్రవారం ఈ జట్టు పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ నూరుల్ హసన్ సారథ్యంలోని రంగ్‌పూర్ రైడర్స్‌తో తలపడింది. మ్యాచ్‌లో రిజ్వాన్ జట్టు గెలిచింది. అయితే, అభిమానులు రిజ్వాన్ క్యాచ్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు.

ఇవి కూడా చదవండి

రిజ్వాన్‌ స్టన్నింగ్ క్యాచ్‌..

రంగ్‌పూర్ జట్టు 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిదో ఓవర్‌కు ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో షమీ హుస్సేన్‌ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ రెండో బంతికి షమీ కట్‌ చేసేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ అంచుకు తగిలి వికెట్‌కీపర్‌కు దూరంగా వెళ్లింది. అయితే రిజ్వాన్ గాలిలో దూకి ఒంటి చేత్తో డైవింగ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. విక్టోరియా జట్టు మొత్తం సంబరాల్లో మునిగితేలుతున్న సమయంలో షమీ ఈ క్యాచ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. రిజ్వాన్ పట్టిన ఈ క్యాచ్ అభిమానులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..