AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: మెట్రో ఛార్జీల విషయంలో ఊరటనిచ్చే మాట చెప్పిన మంత్రి కేటీఆర్‌..

హైదరాబాద్‌ మెట్రో టికెట్ ధరలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు...

Hyderabad Metro: మెట్రో ఛార్జీల విషయంలో ఊరటనిచ్చే మాట చెప్పిన మంత్రి కేటీఆర్‌..
Minister Ktr
Narender Vaitla
|

Updated on: Feb 11, 2023 | 3:15 PM

Share

హైదరాబాద్‌ మెట్రో టికెట్ ధరలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మెట్రో టికెట్‌ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని.. ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని మంత్రి తెలిపారు.

ఇక హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ కొత్త పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేటీఆర్‌ విమర్శించారు. దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి రూ. కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని.. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతోందని కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. మెట్రోలో ఏడీఎస్‌ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్‌ హయాంలోనిదని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. పాత బస్తీకి మెట్రో విస్తరణపై ప్రభుత్వం శిత్తశుద్ధితో ఉందన్న మంత్రి.. హైదరాబాద్‌లో రూ.985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నమని తెలిపారు. ఇప్పటికే నాలా పనులు కొంత పూర్తి కావడంతో.. ఎల్‌బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంత మేర తగ్గిందని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..