AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Formula E Race: ఫార్ములా ఈ- రేస్‌ వద్ద సెలబ్రిటీల సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా సచిన్‌, రామ్‌చరణ్‌

ఈ రేసింగ్‌ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేస్‌ కోసం హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో సుమారు 2.8 కి.మీ. పొడవైన సర్క్యూట్ ని రెడీ చేసింది. అలాగే సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్‌ ను కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

Formula E Race: ఫార్ములా ఈ- రేస్‌ వద్ద సెలబ్రిటీల సందడి.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా సచిన్‌, రామ్‌చరణ్‌
Sachin, Ram Charan, Anand Mahindra
Basha Shek
|

Updated on: Feb 11, 2023 | 1:26 PM

Share

హైదరాబాద్‌ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేస్‌ ఛాంపియన్‌షిప్‌కు సెలబ్రిటీలు తరలిస్తున్నారు. మనదేశంలో మొదటిసారిగా ఈ ఈవెంట్ జరుగుతుండడం, అందుకు మహా నగరం ఆతిథ్యం ఇవ్వడంతో సినీ, క్రీడారంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రేస్‌ను తిలకించేందుకు వస్తున్నారు. ఈ రేసులో మొత్తం 11 జట్లు పోటీపడుతుండగా.. 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా, టాటా, టీసీఎస్ పోటీ దిగ్గజ సంస్థలు బరిలోకి దిగుతున్నాయి. కాగా ఈ రేసింగ్‌ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేస్‌ కోసం హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో సుమారు 2.8 కి.మీ. పొడవైన సర్క్యూట్ ని రెడీ చేసింది. అలాగే సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్‌ ను కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. కాగా శుక్రవారం (ఫిబ్రవరి 10) ఫార్ములా- ఈ రేస్‌ ప్రాక్టీస్‌ జరగ్గా.. ఇవాళ (ఫిబ్రవరి 11) ఉదయం క్వాలిఫయింగ్ రేస్‌ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేసు ప్రారంభం కాబోతుంది. దాదాపు గంటన్నర పాటు ఈ రేసు జరగనుంది.

ఈ క్రమంలో ఫార్ములా- ఈ రేసింగ్ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. శుక్రవారం నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్‌ ఎన్టీఆర్ సతీమణి లక్మీప్రణతి, మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ తదితరలు ఈ రేస్‌లో సందడి చేశారు. ఇక ఇవాళ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, మంత్రి కేటీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, మహేశ్‌ తనయుడు గౌతమ్‌ తదితరులు రేసింగ్ పోటీలకు హాజరయ్యారు. కాగా ఈ రేసుకోసం చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారు సచిన్‌. రామ్‌ చరణ్‌తో కలిసి ఆయన ఫార్ములా-ఈ రేస్‌ వద్ద సందడి చేశారు. ప్రస్తుతం సచిన్, రామ్ చరణ్ కలిసున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి