- Telugu News Photo Gallery Cinema photos Anchor Suma And Rajeev Kanakala Celebrates 24th Wedding Anniversary Through Video Call
Suma- Rajeev Kanakala: 24 ఏళ్ల వివాహ బంధం.. సుమ- రాజీవ్ తమ పెళ్లి రోజును ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా?
ఇవాళ (ఫిబ్రవరి 10) సుమ- రాజీవ్ కనకాలపెళ్లి రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నుంచి ఈ సెలబ్రిటీ దంపతులకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
Updated on: Feb 10, 2023 | 1:43 PM

బుల్లితెరపై మాటల సవ్వడితో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది స్టార్ యాంకర్ సుమ. అదేవిధంగా సిల్వర్ స్ర్కీన్ పై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజీవ్ కనకాల

కాగా ఇవాళ (ఫిబ్రవరి 10) సుమ- రాజీవ్ కనకాలపెళ్లి రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నుంచి ఈ సెలబ్రిటీ దంపతులకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే తమ 24వ పెళ్లి రోజును వెరైటీగా సెలెబ్రేట్ చేసుకున్నారు సుమ కనకాల దంపతులు. వీరిద్దరూ ఒకే చోట లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా పాట రూపంలో తమ 24 ఏళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు.

‘నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటిక్కడ.. పలుకక్కడా అంటూ సుమ పాడగా. 'మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల శ్రుతి కలిపారు.

కాగా గతంలో ఈ జంట మధ్య దూరం పెరిగిపోయిందని.. విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ ఒక్క పోస్ట్‌తో తమ అన్యోన్య బంధాన్ని చాటుకున్నారీ లవ్లీ కపుల్.




