Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yasaswi Kondepudi: చీటింగ్‌ ఆరోపణలపై స్పందించిన సింగర్‌ యశస్వి.. బుద్ధితక్కువై అలా చేశానంటూ..

తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకున్న యశస్విపై చర్యలు తీసుకోవాలని ఫరా డిమాండ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా యశస్విపై ట్రోలింగ్ మొదలైంది. చాలామంది అతనిని తిట్టిపోస్తున్నారు. ఈక్రమంలో తనపై వస్తోన్న విమర్శలు, ట్రోలింగ్‌పై యశస్వి స్పందించాడు

Yasaswi Kondepudi: చీటింగ్‌ ఆరోపణలపై స్పందించిన సింగర్‌ యశస్వి.. బుద్ధితక్కువై అలా చేశానంటూ..
Yasaswi Kondepudi
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2023 | 10:54 AM

సరిగమప టైటిల్‌ విన్నర్‌ యశస్వి కొండెపూడి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సింగింగ్‌ కాంపిటీషన్‌కు హాజరైన యశస్వి.. తాను పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్‌ ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి.. అది తానే నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఆ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు ఫరా కౌసర్‌ మండిపడ్డారు. తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకున్న యశస్విపై చర్యలు తీసుకోవాలని ఫరా డిమాండ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా యశస్విపై ట్రోలింగ్ మొదలైంది. చాలామంది అతనిని తిట్టిపోస్తున్నారు. ఈక్రమంలో తనపై వస్తోన్న విమర్శలు, ట్రోలింగ్‌పై యశస్వి స్పందించాడు..  ‘నవసేన ఫౌండేషన్‌కు, అందులోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు నేనెక్కడా అనలేదు. నేను వాళ్ల దగ్గరకు కూడా వెళ్లలేదు. నాకు, ఈ ఫౌండేషన్‌కు అసలు సంబంధమే లేదు. సాధ్య ఫౌండేషన్‌కు మేమంతా సాయం చేస్తుంటాం. ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన మరికొన్ని సంస్థలకు చేయూత అందిస్తుంది. మా బ్రదర్స్‌ కూడా సాధ్య ఫౌండేషన్‌కు చేతనైన సాయం చేశారు. దీనిద్వారా వారు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు హెల్ప్‌ చేశారు. కాబట్టి వాళ్లతో ఆల్‌ద బెస్ట్‌ చెప్పించుకుంటామన్నారు. అందులో భాగంగానే నవసేన ఫౌండేషన్‌ నిర్వాహకులు ఫరా ఎదురుగానే పిల్లలతో ఆల్‌ద బెస్ట్‌ చెప్పిస్తూ వీడియోలు చేశారు. నా అభిమానులు కూడా పుట్టినరోజు నాడు అదే ట్రస్టులో పిల్లలతో కేక్‌ కట్‌ చేసి విషెస్‌ చెప్పారు. ఆ వీడియోలన్నింటినీ చిన్నగా ఎడిట్‌ చేసి ప్రోమోలో యాడ్‌ చేశారు’

‘అయితే ఇంతలో నవసేన అన్న బోర్డు కనిపించింది. మా పేరు వాడుకున్నారు, కానీ పిల్లలను చూపించలేదు అని ఫరా అడిగారు. దీనికి జస్ట్‌ ప్రోమోనే, ఎపిసోడ్‌లో అంతా వస్తుందని క్లారిటీ ఇచ్చాను. అయితే ఆమె నా మాట వినకుండా మరింత రాద్ధాంతం చేసింది. దీంతో ప్రోమో డిలీట్‌ చేయించా. ఎపిసోడ్‌లో కూడా అవేవీ ఉండకుండా ఎడిట్‌ చేసేయమన్నాను. ఇంతవరకు నా లైఫ్‌లో ఎక్కడా నాకు నెగెటివ్‌ మార్క్‌ లేదు. అలాంటిది ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే చాలా బాధగా ఉంది. పసి పిల్లలను అడ్డు పెట్టుకుని నేనేందుకు పేరు తెచ్చుకోవాలనుకుంటాను? మా సంస్థ బోర్డు వాడారు కాబట్టి 9 నెలల పాటు అనాధాశ్రమాన్ని దత్తత తీసుకోవాలని ఫరా డిమాండ్‌ చేస్తున్నారు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను, కానీ దత్తత ఎలా తీసుకుంటాను? అన్నాను. దీంతో ఆమె లీగల్‌గా వెళ్తానంటున్నారు. మాట విననప్పుడు ఏం చేస్తాను, సరేనన్నాను. కానీ నాకు బుద్ధి తక్కువై ఎపిసోడ్‌కు వీడియోలు ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు యశస్వి. మరి ఈ వ్యాఖ్యలకు నవసేన ఫౌండేషన్‌ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.