AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమా.. తిరుగులేని స్టార్‌డమ్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఒక్కసారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంది..

Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమా.. తిరుగులేని స్టార్‌డమ్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
Tollywood News
Ravi Kiran
|

Updated on: Feb 10, 2023 | 10:08 AM

Share

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఒక్కసారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ షోకు ఎలాంటి తావివ్వకుండా.. సంప్రదాయ తెలుగమ్మాయిగా కనిపిస్తూ.. ఆ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ చేసిన నటనకు ప్రశంసల వర్షం కురిసింది. నార్త్ నుంచి వచ్చినా.. తక్కువ సమయంలోనే సౌత్ ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే దెబ్బకు అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే వెంటనే వెంటనే వచ్చిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయకుండా… కంటెంట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మరీ అచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఈ ముద్దుగుమ్మ కెరీర్‏లో ఇటీవల తెలుగులో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ప్రత్యేకమని చెప్పుకొవాలి. మరి ఇంతకీ ఆమెవరో చెప్పగలరా..? ఇప్పటికైనా గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. మొదటిగా సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంతరం పలు చిత్రాల్లో ఆమె నటించినా.. పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే 2018లో విడుదలైన హిందీ చిత్రం ‘సూపర్ 30’తో మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకుంది. ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ మూవీస్‌తో తన నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.

అలాగే 2022లో తెలుగులో రిలీజైన ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్.. దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ సాధించింది. ఇక ఇప్పుడు హిందీలో 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ చిత్రంలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు కుర్రకారులో పిచ్చ ఫాలోయింగ్ సాధించడమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘సీత’గా మరింత దగ్గరైంది.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..