AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి జోస్యం.. లిస్టులో ఊహించని పేర్లు

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సినిమాలు, టీవీ షోస్, రియాలిటీ షోలకు సంబంధించి అతను చెప్పే రివ్యూలు, అభిప్రాయాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అలా తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ సంబంధించి కొందరి పేర్లు ప్రముఖంగా చెప్పాడు ఆది రెడ్డి.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి జోస్యం.. లిస్టులో ఊహించని పేర్లు
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 17, 2026 | 8:14 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, శ్రష్ఠి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగీ తుళ్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, మిస్ అపూర్వ.. ఇలా చాలా మంది అగ్ని పరీక్ష సీజన్ 2 లో అదృష్టం పరీక్షించుకున్నారు. మరి వీరిలో ఎవరెవరు హౌస్ లోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో గురించి అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 పైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. ఈసారి మొత్తం 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామనర్స్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నాడు ఆది రెడ్డి.

ఇక బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లపైనా వరుసగా హింట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. పల్లవి గౌడ ఈసారి హౌస్ లోకి కచ్చితంగా అవకాశం ఉందని ఆది రెడ్డి అంచనా వేశాడు. అలాగే జబర్దస్త్ ఫేమ్ హరి, రాకింగ్ రాకేష్, నూకరాజుల్లో కచ్చితంగా ఒకరు బిగ్ బాస్ 10లోకి వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్. వీరిలో నూకరాజుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, ఇతనిని చూస్తుంటే ఇమ్మాన్యుయేల్ గుర్తుకు వస్తున్నాడని ఆది రెడ్డి అంటున్నాడు. అలాగే మరో జబర్దస్త్ నటుడు, స్క్రిప్ట్ రైటర్ హరి కూడా హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాడు ఆది రెడ్డి. అలాగే రాయల్ ఎంసీ రమణ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పేరున్న సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్లు ఈసారి హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us