AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

బంగారం ధరలు మరోసారి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల తగ్గిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.. తాజా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో.. మళ్లీ ఎగబాకుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Rate Today
Shaik Madar Saheb
|

Updated on: Aug 18, 2026 | 6:43 AM

Share

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. వారంలోనే బంగారం ధర రూ.3వేలకు పైగా పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,55,670 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,710 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,49,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,820, 22 క్యారెట్ల ధర రూ.1,42,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
రూ.998 ధరతో మార్కెట్లోకి బ్లెండ్‌లైఫ్ జోష్ పోర్టబుల్ బ్లెండర్
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌లోకి షియోమీ మిక్స్ ఫోల్డ్ 5.. ఫీచర్లు ఇవే
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
అప్పట్లో రోజుకు రూ.3 కూలీ.. ఇప్పుడు రూ.160 కోట్ల కంపెనీకి ఓనర్!
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
రెండు తింటే ఇమ్యూనిటీ డబుల్ చేసి డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మాయం
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
ఆగస్టు 18 రాశిఫలాలు: ఆ రాశులకు చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..
యూజర్లకు గుడ్‌న్యూస్‌.. జియో ప్రైమ్‌ రీఎంట్రీ.. ఏడాది పాటు..
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ