AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanmanth: షణ్ముఖ్‌తో అలా చేయడం తప్పే.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సిరి.. శ్రీహాన్‌ ఏమన్నాడంటే?

బిగ్‌బాస్‌ షోలో పాపులారిటీ పెంచుకోవడం కోసమో, మరే కారణమో తెలియదు కానీ షణ్ముఖ్- సిరి బాగా క్లోజ్‌ అయిపోయారు. ముద్దులు, హగ్గులు, ప్రేమలు, కోపాలు, అలకలు.. ఇలా ప్రేమికుల మధ్య ఉండే అన్ని ఎమోషన్స్‌ను చూపించారు. బయట వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉండి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇలా ప్రవర్తించడంపై సిరి, షణ్ణూ ఇద్దరూ భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.

Siri Hanmanth: షణ్ముఖ్‌తో అలా చేయడం తప్పే.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సిరి.. శ్రీహాన్‌ ఏమన్నాడంటే?
Siri Hanmanth
Basha Shek
|

Updated on: Feb 09, 2023 | 12:53 PM

Share

బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హనుమంతుల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్‌ ప్రారంభంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. పెళ్లికూడా చేసుకుందామనుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 రూపంలో సిరి- శ్రీహాన్‌ రిలేషన్‌షిప్‌లో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. ఆ సీజన్‌లో సిరితో పాటు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. షణ్ణూ కూడా దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. అయితే బిగ్‌బాస్‌ షోలో పాపులారిటీ పెంచుకోవడం కోసమో, మరే కారణమో తెలియదు కానీ షణ్ముఖ్- సిరి బాగా క్లోజ్‌ అయిపోయారు. ముద్దులు, హగ్గులు, ప్రేమలు, కోపాలు, అలకలు.. ఇలా ప్రేమికుల మధ్య ఉండే అన్ని ఎమోషన్స్‌ను చూపించారు. బయట వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉండి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇలా ప్రవర్తించడంపై సిరి, షణ్ణూ ఇద్దరూ భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ నెగెటివిటీ కారణంగానే బిగ్‌బాస్‌ విజేతగా నిలవాల్సిన షణ్ముఖ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ వ్యవహారంతో హౌస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పేసింది దీప్తి సునైనా. శ్రీహాన్-సిరిల మధ్య మనస్పర్థలు వచ్చాయని చాలామంది భావించారు. అయితే వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు. కాగా బిగ్‌బాస్‌లో తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడింది సిరి. షణ్ముఖ్‌తో క్లోజ్‌గా మూవ్‌ అవ్వడం తప్పేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ టీవీ ఛానల్ లో జరిగిన కార్యక్రమానికి శ్రీహాన్- సిరి ఇద్దరు కలిసి వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సిరి బిగ్‌బాస్‌ అనుభవాలను గుర్తుచేసుకుంది. షణ్ణూతో క్లోజ్‌గా ఉండటంపై స్పందిస్తూ ఎమోషనలైంది. జీవితంలో చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారని, అయితే వాటిని ఎవరూ ఒప్పుకోరని చెప్పుకొచ్చింది సిరి. తాను తెలియకుండానే తప్పు చేశానని కన్నీరు పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న శ్రీహాన్ సిరిని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇదే వేదికపై శ్రీహాన్ కు గోల్డెన్‌ రోజ్‌ ఇచ్చి ప్రపోజ్ చేసింది. శ్రీహాన్ చాలా యూనిక్ గా ఉంటాడని అందుకే ఈ రోజ్ ఇచ్చానని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు చాలా మిస్ అయ్యానని, తను గుర్తొచ్చినప్పుడల్లా తన దగ్గర ఉన్న శ్రీహాన్ షర్ట్ ను కిస్ చేసేదాన్నంటూ అప్పటి అనుభవాలను గుర్తు తెచ్చుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి