AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiraak RP: కిర్రాక్‌ ఆర్పీ చేపల పులుసు వారి భిక్షే.. షాకింగ్ కామెంట్స్‌ చేసిన రాకింగ్‌ రాకేశ్‌

మరోసారి వార్తల్లోకి ఎక్కింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అదేంటంటే.. మరో జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ ఈ ఫుడ్‌ సెంటర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చాడు.

Kiraak RP: కిర్రాక్‌ ఆర్పీ చేపల పులుసు వారి భిక్షే.. షాకింగ్ కామెంట్స్‌ చేసిన రాకింగ్‌ రాకేశ్‌
Kiraak Rp, Rocking Rakesh
Basha Shek
|

Updated on: Feb 08, 2023 | 2:09 PM

Share

జబర్దస్త్ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ ప్రారంభించిననెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫుడ్‌ సెంటర్‌ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. మొదట కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్‌ సెంటర్‌కు బాగా రెస్పాన్స్‌ వచ్చింది. ఒకానొకదశలో బౌన్సర్లతో కస్టమర్లను కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ సమస్యలూ తలెత్తాయి. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ షాపు మూత పడింది. అయితే మరిన్ని హంగులతో తిరిగి వారంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును పునఃప్రారంభించాడు. నెల్లూరుకు కొందరు మహిళలను హైదరాబాదుకు తీసుకొచ్చి మరీ కర్రీ పాయింట్‌ను రీఓపెన్‌ చేశాడు. కాగా ఈ మధ్యన తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు ఆర్పీ. పని గట్టుకుని ఒక పెయిడ్‌ బ్యాచ్‌ తనపై కుట్రపన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మరవకముందే మరోసారి వార్తల్లోకి ఎక్కింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అదేంటంటే.. మరో జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ ఈ ఫుడ్‌ సెంటర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆర్పీని ఈ మధ్య ఏమైనా కలిశారా? అన్న ప్రశ్నకు.. ‘లేదండి.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అని పరోక్షంగా కిర్రాక్‌ ఆర్పీని విమర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కిర్రాక్‌ ఆర్పీ కూడా ఒకరు. చలాకీ చంద్రతో కలిసి ఆయన చేసిన స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే చలాకీ చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో తన ట్యాలెంట్‌కు గుర్తింపుగా కిర్రాక్‌ ఆర్పీ పేరుతోనే టీం లీడర్‌గా ఎదిగాడు. అయితే ఎప్పుడైతే మెగా బ్రదర్‌ నాగబాబు షో నుంచి వెళ్లిపోయారో ఆర్పీ కూడా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆతర్వాత వేరే ఛానల్స్ లో వెళ్లి ఆకట్టుకున్నాడు. ఆమధ్యన జబర్దస్త్, మల్లెమాల మేనేజ్‌మెంట్‌పై కొన్ని షాకింగ్‌ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఆతర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సొంతంగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..