Kiraak RP: వారు నా చేపల పులుసుపై కుట్ర పన్నారు.. టేస్ట్‌ బాగోలేదంటూ విష ప్రచారం: కిర్రాక్‌ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్యన తన 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రుచి అసలు బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని ప్రచారం చేస్తున్నారని కిర్రాక్‌ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనంటే పడని కొందరు పెయిడ్‌ బ్యాచ్‌ తనపై కుట్ర పన్నారని, అందుకే ఈ విష ప్రచారానికి పాల్పడుతున్నారన్నాడు.

Kiraak RP: వారు నా చేపల పులుసుపై కుట్ర పన్నారు.. టేస్ట్‌ బాగోలేదంటూ విష ప్రచారం: కిర్రాక్‌ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
Kiraak Rp
Follow us
Basha Shek

|

Updated on: Feb 07, 2023 | 10:53 AM

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తమ ట్యాలెంట్‌తో టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. అందులో కొందరు వెండితెరపై కూడా సత్తాచాటుకుంటున్నారు. అలా జబర్దస్త్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ కూడా ఒకరు. చలాకీ చంద్రతో కలిసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఆతర్వాత కిర్రాక్‌ ఆర్పీ పేరుతోనే టీం లీడర్‌గా ఎదిగాడు. అయితే ఎప్పుడైతే నాగబాబు షో నుంచి వెళ్లిపోయారో ఆర్పీ కూడా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆతర్వాత వేరే ఛానల్స్ లో వెళ్లి ఆకట్టుకున్నాడు. అయితే ఆపై నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సొంతంగా బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. మొదట కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్‌ సెంటర్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. బౌన్సర్లతో కస్టమర్లను కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ సమస్యలూ తలెత్తాయి. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ బ్రాంచ్‌ మూత పడింది. అయితే మరిన్ని హంగులతో తిరిగి వారంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును రీ ఓపెన్‌ చేశాడు. కాగా ఈ మధ్యన తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రుచి అసలు బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని ప్రచారం చేస్తున్నారని కిర్రాక్‌ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనంటే పడని కొందరు పెయిడ్‌ బ్యాచ్‌ తనపై కుట్ర పన్నారని, అందుకే ఈ విష ప్రచారానికి పాల్పడుతున్నారన్నాడు.

‘నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. కానీ ఈ మధ్యన కొందరు పెయిడ్‌ బ్యాచ్‌ నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫుడ్‌ సెంటర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేరు. నేను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా. షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లు రుచి ఎంతో బాగుందంటూ వందలాది మంది కొత్త కస్టమర్లను వెంటపెట్టుకొని మరీ వస్తున్నారు. టెస్ట్ లేకపోతే తన కర్రీ పాయింట్ వద్దకు ఎవరూ రారు. అయితే ఒక్కడు బాగాలేదని నెగెటివ్‌ కామెంట్లు చేయడమంటే ఆ వ్యక్తి ఎంత ఓర్వలేనివాడో ఇట్టే అర్థమవుతుంది. నేను చేపలు పులుసు తయారు చేస్తూ నా కిచెన్ లో ఎన్నో వీడియోలు తీశాను. అవే నా నిజాయతీకి నిదర్శనం. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటివ్‌ చేస్తే.. నాకు అంత ప్రమోషన్’ అని అంటున్నాడు ఆర్పీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kiraak RP (@kiraaakrp)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?