Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanthi: ఆ సినిమా షూటింగ్‌లో నా చీర, జుట్టుకు మంటలంటుకున్నాయి.. ఆ హీరోనే కాపాడాడు: విజయశాంతి

మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె తన దృష్టంతా రాజకీయాలపైనే సారించారు.

Vijayashanthi: ఆ సినిమా షూటింగ్‌లో నా చీర, జుట్టుకు మంటలంటుకున్నాయి.. ఆ హీరోనే కాపాడాడు: విజయశాంతి
Vijayashanthi
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2023 | 6:28 PM

పురుషాధిక్యం కలిగిన సినిమా ప్రపంచంలో స్టార్‌ హీరోలకు ధీటుగా క్రేజ్‌ తెచ్చుకున్నారు విజయశాంతి. ఓవైపు అగ్రనటుల పక్కన గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్‌ వంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించారు. తద్వారా దక్షిణాది పరిశ్రమలో లేడీ సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 4 దశాబ్దాల సినిమా కెరీర్‌లో 180కు పైగా సినిమాల్లో నటించిన ఈ అందాల తార సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ నటించారు. మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె తన దృష్టంతా రాజకీయాలపైనే సారించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయశాంతి.. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ నా చిన్నవయసులోనే నాన్న గుండెపోటుతో కన్నుమూశారు.ఆ బెంగతో అమ్మ కూడా మంచానపడింది. కొన్నాళ్లకే అమ్మ కూడా చనిపోయారు. ఆ తర్వాత నేను ఎవరి మీదా ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. సినిమా ఇండస్ట్రీలో నా మొదటి పారితోషకం రూ.5వేలు. అయితే అందులోనూ కోత విధించి 3 వేలే ఇచ్చారు. అయితే ఆ తర్వాత కోటి రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్లాను. అప్పట్లో దేశంలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న అగ్ర సినీ తారల్లో రజనీకాంత్‌, అమితాబ్‌తో పాటు నేను కూడా ఉన్నాను’

అందరూ భయపడి ఏడ్చేశారు..

‘నేను దాదాపు అన్ని భాషల్లో నటించాను. 180 దాకా సినిమాలు చేశాను. అయితే అందులో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలే నాకు ఎక్కువ ఇష్టం. కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ.. ఈ మూడు సినిమాలు కూడా నా కెరీర్‌లో మూడు ఆణిముత్యాల్లాంటివి. అయితే జీవితంలో నేను చాలా సార్లు చచ్చి బతికాను. లేడీ బాస్‌ సినిమా క్లైమాక్స్‌లో రైలు కంపార్ట్‌మెంట్‌ మారాలి. అయితే నేను బయటకు వస్తుండగా నా చేతులు స్లిప్‌ కావడంతో కింద రాడ్‌ పట్టుకున్నాను. రైలు కదులుతూనే ఉంది. నేను గాల్లోనే ఎగురుతున్నాను. ఎలాగోలా తిరిగి కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాను. ఏమాత్రం స్లిప్‌ అయినా లోయలో పడిపోయేదాన్ని. అప్పటికే అందరూ భయపడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ షాట్‌ వద్దన్నారు. అయితే నేను మాత్రం పర్వాలేదని మరో టేక్‌లో షాట్‌ పూర్తి చేశాను’

ఆ హీరోనే కాపాడాడు..

‘ఇక మరో తమిళ్‌ సినిమా షూటింగులో భాగంగా ఓ గుడిసెలో నన్ను కుర్చీకి కట్టేశారు. ఆ తర్వాత గుడిసెకు నిప్పుపెట్టారు. అయితే గాలి ఎక్కువగా ఉండడంతో నా చీర, జుట్టకు మంటలంటుకున్నాయి. అది చూసిన హీరో విజయ్‌కాంత్‌ వెంటనే లోపలకు వచ్చి నన్ను కాపాడాడు. ఇలా చాలాసార్లు మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చాను’ అని అప్పటి చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు విజయశాంతి.

ఇవి కూడా చదవండి
Vijaykanth, Vijayashanthi

Vijaykanth, Vijayashanthi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..