ఓ తండ్రిగా నా బాధ్యతను నెరవేర్చా.. నా బిడ్డకు మంచి భర్తను ఇచ్చా.. కూతురిని అత్తారింటికి పంపే క్షణాన అఫ్రిది ఎమోషనల్‌

తన కుమార్తెను అత్తారింటికి పంపే క్షణంలో షాహిద్ ఆఫ్రిది భావోద్వేగానికి లోనయ్యాడు. నిఖా తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. తన కూతరు పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ..

ఓ తండ్రిగా నా బాధ్యతను నెరవేర్చా.. నా బిడ్డకు మంచి భర్తను ఇచ్చా.. కూతురిని అత్తారింటికి పంపే క్షణాన అఫ్రిది ఎమోషనల్‌
Shaheen Afridi Marriage
Follow us

|

Updated on: Feb 04, 2023 | 6:12 PM

పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్ షాహీన్‌ షా ఆఫ్రిది ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్‌ షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాతో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కరాచీ నగరంలోని ఓ మసీదులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షాహీన్‌ షా పెళ్లికి కెప్టెన్‌ బాబర్‌ ఆజం, సర్ఫరాజ్‌, మాజీ కోచ్‌ సక్లైన్‌ ముస్తాక్‌తో సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం షాహీన్‌షా- అన్షాల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌ క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా కొత్త జంటకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. కాగా తన కుమార్తెను అత్తారింటికి పంపే క్షణంలో షాహిద్ ఆఫ్రిది భావోద్వేగానికి లోనయ్యాడు. నిఖా తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. తన కూతరు పెళ్లి ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘ కూతురంటే ఓ ఇంటి పూదోటలో వికసించే అందమైన పుష్పం. తనతో కలిసి మనస్ఫూర్తిగా నవ్వగలం, తన కలలను ప్రేమించగలం. తను ఉంటే చాలనిపిస్తుంది. ఇక ఓ తండ్రిగా నా బిడ్డ పట్ల నా బాధ్యతను నెరవేర్చా. షాహిన్‌ ఆఫ్రిదిని తనకు భర్తగా ఇచ్చాను. నూతన దంపతులకు శుభాభినందనలు’ అని ట్వి్ట్టర్‌లో పేర్నొన్నాడు అఫ్రిది.

కా గా 22 ఏళ్ల షాహీన్‌ అఫ్రిది ఇప్పటివరకు పాక్‌ తరఫున 25 టెస్ట్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు. 32 వన్డేల్లో 62 వికెట్లు నేలకూల్చాడు. అలాగే 47 టీ20 మ్యాచుల్లో 58 వికెట్ల పడగొట్టి పాక్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా పెళ్లి తర్వాత మళ్లీ క్రికెట్‌లో బిజీ కానున్నాడు షాహీన్. ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్‌కు అతను సారథ్యం వహించనున్నాడు. కాగా పాకిస్తాన్‌ తదుపరి సిరీస్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో ఇరుజట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!