Shaheen Afridi: పెళ్లిపీటలెక్కిన స్టార్‌ పేసర్‌.. మాజీ క్రికెటర్‌ కుమార్తెతో కలిసి నిఖా.. సందడి చేసిన స్టార్‌ ఆటగాళ్లు

షాహీన్‌-అన్షాల ఎంగేజ్‌మెంట్‌ రెండేళ్ల క్రితమే జరిగింది. అయితే అన్షా చదువులకు తోడు షాహీన్‌ క్రికెట్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉండడంతో పెళ్లి పీటలెక్కేందుకు ఈ సమయం పట్టింది.

Shaheen Afridi: పెళ్లిపీటలెక్కిన స్టార్‌ పేసర్‌.. మాజీ క్రికెటర్‌ కుమార్తెతో కలిసి నిఖా.. సందడి చేసిన స్టార్‌ ఆటగాళ్లు
Shaheen Afridi Marriage
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2023 | 8:35 PM

పాకిస్తాన్‌ యంగ్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ ఓ ఇంటివాడయ్యాడు. మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తె అన్షాతో కలిసి నిఖా చేసుకున్నాడు. కరాచీ నగరంలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు పాక్‌ క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. వివాహం తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారు. పాక్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, సర్ఫరాజ్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ హఫీజ్, మాజీ కోచ్ సక్లైన్ ముస్తాక్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే షాహీన్‌ పీఎస్‌ఎల్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) జట్టు లాహోర్‌ ఖలందర్స్‌ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా షాహీన్‌-అన్షాల ఎంగేజ్‌మెంట్‌ రెండేళ్ల క్రితమే జరిగింది. అయితే అన్షా చదువులకు తోడు షాహీన్‌ క్రికెట్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉండడంతో పెళ్లి పీటలెక్కేందుకు ఈ సమయం పట్టింది. ప్రస్తుతం పాక్‌కు ఎలాంటి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ క్రికెట్‌ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. మొన్నటివరకు షాహీన్‌ అఫ్రిది కూడా బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు. అయితే వివాహం కోసం స్వదేశానికి తిరిగి వచ్చాడు.

ప్రస్తుతం షాహీన్‌-అన్షాల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సహచర క్రికెటర్లతో పాటు పలువురు నెటిజన్లు కొత్త దంపతులకు విషెస్‌ చెబుతున్నారు. కాగా 22 ఏళ్ల షాహీన్‌ అఫ్రిది ఇప్పటివరకు పాక్‌ తరఫున 25 టెస్ట్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు. 32 వన్డేల్లో 62 వికెట్లు నేలకూల్చాడు. అలాగే 47 టీ20 మ్యాచుల్లో 58 వికెట్ల పడగొట్టి పాక్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా పాకిస్తాన్‌ తదుపరి సిరీస్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో ఇరుజట్ల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?