AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అందుకే అందరివాడయ్యాడు.. పాకీజా దీన పరిస్థితి చూసి చలించిపోయిన చిరంజీవి.. ఆర్థిక సాయంతో పాటు..

ఎన్నో తెలుగు, తమిళ్‌ సినిమాల్లో లేడీ కమెడియన్‌గా మెప్పించిన  పాకీజా అలియాస్ వాసుకీ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతోంది. సినిమా అవకాశాలు లేక ఇప్పుడు ఓ హాస్టల్‌లో గడుపుతోంది.

Chiranjeevi: అందుకే అందరివాడయ్యాడు.. పాకీజా దీన పరిస్థితి చూసి చలించిపోయిన చిరంజీవి.. ఆర్థిక సాయంతో పాటు..
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 02, 2023 | 3:25 PM

Share

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి సేవా గుణంలోనూ తక్కువేమీ కాదు. ఐ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌ అంటూ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నరాయన. కరోనా కాలంలో సినీ కార్మికుల కోసం ఎన్నో ప్రయోజక కార్యక్రమాలు చేపట్టి తన దాన గుణాన్ని చాటుకున్నారు. టాలీవుడ్‌లో అందరివాడుగా గుర్తింపు పొందిన చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ల కన్నీళ్లు తుడిచేందుకు ఎందాకైనా వెళతారు. తాజాగా మరోసారి తమ మచి మనసును చాటుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. కష్టాల కడలిలో బతుకీడుస్తోన్న అలనాటి నటి పాకీజా అలియాస్‌ వాసుకీకి ఆపననహస్తం అందించారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రకు ఎంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్యారెక్టర్‌లో నటించి అందరినీ నవ్వించిందామె. ముఖ్యంగా కామెడీ కింగ్‌ బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత వాసుకీ పేరు పాకీజాగానే మారిపోయిందంటే ఎంతగా ఆ పాత్ర ప్రేక్షకుల్లోకి చేరిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో తెలుగు, తమిళ్‌ సినిమాల్లో లేడీ కమెడియన్‌గా మెప్పించిన  పాకీజా అలియాస్ వాసుకీ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతోంది. బిజీ ఆర్టిస్టుగా ఉన్న కాలంలో కోట్లు సంపాదించిన ఈ స్టార్‌ కమెడియన్‌ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్నదంతా పోగొట్టుకుందట. సినిమా అవకాశాలు లేక ఇప్పుడు ఓ హాస్టల్‌లో గడుపుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ ద్వారా తన దీని స్థితిని వివరించారామె. తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన పాకీజా దీనస్థితి చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా ఇటీవల వాసుకీ గురించి తెలుసుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. సినిమాల్లో కానీ, బుల్లితెరపై కానీ పాకీజాకు అవకాశాలు ఇప్పించేందుకు తన వంతు సాయపడతానని ప్రకటించారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి పాకీజా పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. ఆమెకు ఆర్థికంగా చేయూత నివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే సినిమాలు, సీరియల్స్‌లోనూ పాకీజాకు పాత్రలు ఇచ్చి ఆమె తన కాళ్లపై తాను బడేలా సాయపడాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కాగా చిరంజీవి కానీ, నాగబాబుతో కానీ ఒక్క సినిమాలో నటించలేదు పాకీజా. అయితే కన్నీటి కష్టాల్లో ఉన్న తనను ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు రావడంపై పాకీజా ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం తాను ఒక ముద్ద తింటున్నానంటే అది తెలుగు వాళ్లు పెట్టిందేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్