Tollywood: రాజకోటలో రాజనందిని.. ఉంగురాల ముంగురులతో గాలిని సైతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.. గుర్తుపట్టండి..

అభినయంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. కానీ టాలెంట్ ఎంత ఉన్నా.. అదృష్టం కూడా కాసింత ఉండాల్సిందే కదా.. నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది.. స్టోరీ ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంది.

Tollywood: రాజకోటలో రాజనందిని.. ఉంగురాల ముంగురులతో గాలిని సైతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 02, 2023 | 3:48 PM

రాజకోటలో రాజనందిని.. ఉంగురాల ముంగురులతో గాలిని సైతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది కదూ.. ఆ సుందరి ఎవరో గుర్తుపట్టండి. మొదటి చిత్రంతోనే తెలుగు కుర్రాళ్ల మది దొచుకున్న ముద్దుగుమ్మ. అందం, అభినయంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. కానీ టాలెంట్ ఎంత ఉన్నా.. అదృష్టం కూడా కాసింత ఉండాల్సిందే కదా.. నటనపరంగా ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది.. స్టోరీ ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటు వెండితెరపైనే కాకుండా.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ ఈ అమ్మడు అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు చిత్రాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ హీరోయిన్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ రాలేదు. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో చిన్న క్లూ. ఈ అందాల వయ్యారి టాలీవుడ్ అందాల రాక్షసి. ఎవరో గుర్తుపట్టారా ? ..

ఆ అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లావణ్య. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, ఇంటిలిజెంట్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో లావణ్యకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆమె చివరిసారిగా హ్యాపీ బర్త్ డే చిత్రంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

2012లో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ అయోధ్యలో పుట్టింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం విన్ అయింది. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వచ్చినా.. ఊహించినంత స్టార్‌డమ్ అయితే రాలేదు. ప్రస్తుతం కథలు ఎంచుకునే పనిలో ఉండగా.. సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.