AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఆ స్టార్ హీరోతో మరోసారి జత కట్టనున్న న్యాచురల్ బ్యూటీ.. రూ. 100 కోట్ల బడ్జెట్ చిత్రంలో సాయి పల్లవి..

తమిళ్ స్టార్ హీరో సూర్య నిర్మించి గార్గి మూవీలో నటించింది. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

Sai Pallavi: ఆ స్టార్ హీరోతో మరోసారి జత కట్టనున్న న్యాచురల్ బ్యూటీ.. రూ. 100 కోట్ల బడ్జెట్ చిత్రంలో సాయి పల్లవి..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2023 | 10:08 AM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి దక్షిణాదిలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దొచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటన.. అందం.. ఆడియన్స్ హృదయాలను తాకింది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. ఫిదా తర్వాత సాయి పల్లవి ఎన్నో చిత్రాల ఆఫర్స్ వచ్చాయి. కానీ కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తెలుగులో ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు.. చివరిసారిగా విరాటపర్వం సినిమాతో ఆకట్టుకుంది. ఇందులో నటనపరంగా సాయిపల్లవి విమర్శకుల ప్రశంసలు అందుకున్న.. కమర్షియల్ గా మాత్రం అలరించలేకపోయింది. ఇక ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో సూర్య నిర్మించి గార్గి మూవీలో నటించింది. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. దీంతో సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇవే కాకుండా.. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా డాక్టర్ చదువు కంప్లీట్ చేసి సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుందని టాక్ నడించింది. ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం నెట్టింటిని షేక్ చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఆమె రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అది కూడా తమిళ్ స్టార్ హీరో ధనుష్ 50వ సినిమాలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా టాక్. ఈ చిత్రానికి ఆమె కూడా ఒప్పుకున్నారట. రూ. 100 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక అంతేకాకుండా.. తమిళ్ స్టార్ అజిత్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సినిమాలోనూ ఒక కీలకమైన పాత్రలో సాయి పల్లవి కనిపించనుందని టాక్. అయితే ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే గతంలో సాయి పల్లవి, ధనుష్ కాంబోలో వచ్చిన మారి 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాలజీ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీ 2018 డిసెంబర్ 21న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ డూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us