AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ ఆ సినిమాతోనే ఇంట్రడ్యూస్ కావాల్సింది.. కానీ అన్నయ్య అలా అన్నారు.. మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్..

చరణ్ చిరుత సినిమాతో కాకుండా.. మరో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉందట. కానీ చెర్రీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదని ఇంకా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవాలని.. ఆ సినిమాను మరో హీరోకు సజెస్ట్ చేశారట.

Ram Charan: రామ్ చరణ్ ఆ సినిమాతోనే ఇంట్రడ్యూస్ కావాల్సింది.. కానీ అన్నయ్య అలా అన్నారు.. మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్..
Ram Charan, Nagababu
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2023 | 3:24 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు రామ్ చరణ్. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. చెర్రీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. చరణ్ కాంబోలో వచ్చిన మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో చరణ్ స్టార్ డమ్ వచ్చేసింది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల ట్రిపుల్ ఆర్ చిత్రంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఫాలోయింగ్ సంపాదించుకున్న చెర్రీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే చరణ్ చిరుత సినిమాతో కాకుండా.. మరో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉందట. కానీ చెర్రీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదని ఇంకా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవాలని.. ఆ సినిమాను మరో హీరోకు సజెస్ట్ చేశారట. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు ఆ న్యూయంగ్ హీరో. ఇంతకీ ఏంటా సినిమా ?ఎవరా హీరో అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సిన సినిమా గంగోత్రి. కానీ అప్పుడే చరణ్ మెచ్యూరిటీ రాలేదని.. ఇంకా ట్రైనింగ్ కావాలని చెబుతూ.. ఆ ప్రాజెక్టును బన్నీ చేయాలని కోరారట. అలా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఈ విషయాలను ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు.

“మా కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వస్తారని.. హీరోలు అవుతారని మేము అనుకోలేదు. ఇండస్ట్రీలో ఎలా అయితే అన్నయ్యను చూసి ఇన్ స్పైర్ అయ్యి హీరోలు అయ్యారో.. అలాగే మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆయన స్పూర్తితోనే హీరోలు అయ్యారు. అలా అయిన వాళ్లలో బన్నీ కూడా. బన్నీకి వచ్చిన గంగోత్రి చిత్రం ఆఫర్ ముందు చరణ్ కు వచ్చింది. చరణ్ బాబును అడిగినప్పుడు అన్నయ్య వద్దు అన్నారు. చరణ్ కు ఇంకాస్త మెచ్యురిటీ రావాలి. నటనలో ఇంకా ట్రైనింగ్ కావాలి. ఈ సినిమాకు బన్నీ సెట్ అవుతాడు. ఆ సినిమా బన్నీతో చేస్తే బాగుంటుందని చెప్పారు. అలా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు” అంటూ చెప్పుకొచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..