Priyanka Chopra Daughter: ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఎంత ముద్దుగా ఉందో చూశారా ?..

తాజాగా తమ కూతురి ఫేస్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తన భర్త నిక్ జోనాస్, అతని సొదరులు కెవిన్, జో కలిసి నిర్వహించిన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురితో కలిసి పాల్గొంది.

Priyanka Chopra Daughter: ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఎంత ముద్దుగా ఉందో చూశారా ?..
Priyanka Chopra
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 3:20 PM

బాలీవుడ్ స్టారీ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ జంట ముద్దుల తనయను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంగా తన కూతురితో కలిసున్న ఫోటోస్.. ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంది ప్రియాంక. కానీ తన కూతురి ఫేస్ కనిపించకుండా ప్రతిసారి హైడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా తమ కూతురి ఫేస్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తన భర్త నిక్ జోనాస్, అతని సొదరులు కెవిన్, జో కలిసి నిర్వహించిన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురితో కలిసి పాల్గొంది.

ఈ వేడుకలలో తన కూతురితో కలిసి ప్రియాంక ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ప్రియాంక, నిక్ జోనాస్ కూతురు ఎంతో ముద్దుగా .. అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు. వీరికి 2022 జనవరి 15న సరోగసి విధానం ద్వారా పాపకు జన్మనిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆ పాపకు మాల్తీ మరియెస్ అనే పేరు పెట్టారు. కొన్నాళ్లుగా తన కూతురు ఫేస్ చూపించని ప్రియాంక తన కూతురు ముఖాన్ని రివీల్ చేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.