AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butta Bomma: బుట్టబొమ్మ ప్రెస్‏మీట్‏లో రిపోర్టర్‏కు కౌంటరిచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇప్పుడు చీర కట్టుకుని రమ్మంటావా అంటూ..

యువత ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.

Butta Bomma: బుట్టబొమ్మ ప్రెస్‏మీట్‏లో రిపోర్టర్‏కు కౌంటరిచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఇప్పుడు చీర కట్టుకుని రమ్మంటావా అంటూ..
Butta Bomma Trailer
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2023 | 4:51 PM

Share

చైల్డ్ ఆర్టిస్ట్ అనిక సురేంద్రన్.. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న లేటేస్ట్ చిత్రం బుట్టబొమ్మ. . ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాను నిర్మిస్తోంది. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘వినోదంలో కథేముందో’ పాటకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యువత ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విడుదలైన ‘బుట్ట బొమ్మ’ ట్రైలర్.. టైటిల్ కి తగ్గట్లే అందంగా, ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. అయితే ట్రైలర్ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనస్టైల్లో కౌంటరిచ్చారు నిర్మాత నాగవంశీ.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఇది ఒక మంచి పల్లెటూరి కథ. ఐదేళ్ల క్రితం ఉయ్యాల జంపాల అనే సినిమా చూశాం. అలాంటి సినిమాలో సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది ఈ సినిమా. ఈ మధ్య చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి ఇలా ఎక్కువగా మాస్ సినిమాలు చూశాం. ఇప్పుడు క్లాస్ సినిమా చూస్తారు. సస్పెన్స్ తో కూడిన ఒక క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ ఇది. అలాగే ఎంతో బిజీగా ఉన్నప్పట్టికీ పిలవగానే ట్రైలర్ లాంచ్ కోసం ముంబై నుంచి వచ్చిన విశ్వక్ సేన్ కి థాంక్స్. విశ్వక్ సేన్ చెప్పినట్లు త్వరలోనే మా కలయికలో కొత్త సినిమా ప్రకటన వస్తుంది. అందులో విశ్వక్ సేన్ విశ్వరూపం చూస్తారు” అన్నారు.

అదే సమయంలో ఓ రిపోర్టర్ హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ కు.. సినిమాలోని ఆమె పాత్రకు చాలా వ్యత్సాసం ఉందని నవ్వుతూ అడగ్గా.. ఈ అమ్మాయి బుట్టబొమ్మలా లేదా ?.. అంటే ఏంటీ ఈ అమ్మాయిని చీర కట్టుకుని రమ్మంటావా అంటూ సరదాగా కౌంటరిచ్చారు నాగవంశీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు.. ఇంటిలో కాసుల వర్షమే!
బియ్యం డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు.. ఇంటిలో కాసుల వర్షమే!
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఏం లెగ్ రా భయ్.. ఏ జట్టులో చేరితే ఆ టీం ట్రోఫీకి దూరమవ్వాల్సిందే?
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
ఈ సీక్రెట్‌ తెలుసా? ఇలా చేస్తే 30 రోజులు వచ్చే గ్యాస్ 45 రోజులు
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
విజయ్ మాస్టర్ స్ట్రోక్.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్..
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..