Ram Gopal Varma: ‘పఠాన్’ సినిమా పై ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్.. షారుఖ్ పని అయిపోయిందన్నారు అంటూ..

తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. బాద్ షా సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పఠాన్ పై ప్రశంసలు కురిపిస్తూ.. షారుఖ్ గురించి చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma: 'పఠాన్' సినిమా పై ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్.. షారుఖ్ పని అయిపోయిందన్నారు అంటూ..
Rgv, Pathaan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 27, 2023 | 3:41 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్‏ను రఫ్పాడిస్తున్నారు. చాలా కాలంగా వరుస ప్లాపులను ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన నటించిన పఠాన్ సినిమా ప్రస్తుతం సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ. 200 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో షారుఖ్.. పఠాన్ చిత్రం విజయం పై అభినందనలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. బాద్ షా సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పఠాన్ పై ప్రశంసలు కురిపిస్తూ.. షారుఖ్ గురించి చెప్పుకొచ్చారు. దక్షిణాది దర్శకుల మాదిరిగా బాలీవుడ్ వాళ్లు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించలేరనే అపోహను ఈ సినిమాతో పటాపంచలు చేసిందని అన్నారు.

“1. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అభివృద్ధి చెందుతున్న సమయంలో థియేటర్లలో మళ్లీ గొప్పగా కలెక్షన్స్ ఉండవు. 2. షారుఖ్ ఖాన్ కెరీర్ అయిపోయింది.. (ఫేడింగ్ స్టార్) 3. దక్షిణాది దర్శకులలా బాలీవుడ్ వాళ్లు ఎప్పుడూ కమర్షియల్ హిట్ చిత్రాలను తెరకెక్కించలేరు. 4. కేజీఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్స్ బ్రేక్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పైన తెలిపిన అన్ని అపోహలను పఠాన్ సినిమా విచ్ఛిన్నం చేసింది” అంటూ ట్వీట్ చేశారు వర్మ. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

వరుస డిజాస్టర్స్ అనంతరం.. చాలా కాలం వరకు షారుఖ్ సైలెంట్ అయ్యారు. జీరో సినిమా తర్వాత బాద్ షా నుంచి మరో మూవీ రాలేదు. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాద్ షా నటించిన ఈ పఠాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటించగా.. జాన్ అబ్రహం కీలకపాత్ర పోషించారు. ఇందులో షారుఖ్ రా ఏజెంట్ గా కనిపించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..