Ravi Teja Birthday: రవితేజ బర్త్ డే సర్‏ప్రైజ్ వచ్చేసింది.. రావణసుర గ్లింప్స్ వేరేలెవల్.. సస్పెన్స్ థ్రిల్లర్‏గా మాస్ మహారాజా..

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న రావణసుర గ్లింప్స్ విడుదల చేశారు.

Ravi Teja Birthday: రవితేజ బర్త్ డే సర్‏ప్రైజ్ వచ్చేసింది.. రావణసుర గ్లింప్స్ వేరేలెవల్.. సస్పెన్స్ థ్రిల్లర్‏గా మాస్ మహారాజా..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2023 | 11:58 AM

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పుడు ఆయన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్‌ తో దూసుకెళ్తున్నారు. ఓవైపు వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తాజా చిత్రం ‘రావణాసుర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న రావణసుర గ్లింప్స్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. ఇందులో వివరాలు పూర్తిగా తెలియజేయలేదు. కానీ రివీల్ చేసిన విజువల్స్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ డార్క్ థీమ్ లో రవితేజ యాటిట్యూడ్.. తన లుక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక చివరగా.. టైటిల్ కు తగినట్టుగానే పగిలిన గ్లాస్ లో రవితేజని పలు ముఖాల్లో చూపించారు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ తో సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశారు మేకర్స్.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర థియేటర్స్ లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.