Rashmika Mandanna: ‘ఆ మాటలు మానసికంగా బాధిస్తాయి.. నేను ఉండాలా ? వెళ్లిపోవాలా ?’.. రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jan 25, 2023 | 3:17 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన తాను ఎంతగా బాధపడిందో చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో చిత్రపరిశ్రమను వదిలేయాలని కూడా అనుకున్న సందర్భాలున్నాయని తెలిపింది.

Rashmika Mandanna: 'ఆ మాటలు మానసికంగా బాధిస్తాయి.. నేను ఉండాలా ? వెళ్లిపోవాలా ?'.. రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్..
Rashmika Mandanna

ప్రస్తుతం సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అటు తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ రష్మికకు వరుస ఆఫర్స్ క్యూకడుతున్నాయి. ఇటీవల వారిసు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్. అయితే ఓవైపు వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక.. అటు వివాదాల్లో కూడా చాలాసార్లు చిక్కుకుంది. గతేడాది ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడింది. ముఖ్యంగా ఈ అమ్మడుపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. చిన్న చిన్న పొరపాట్లు.. మిస్ కమ్యూనికేషన్స్.. పొరపాటుగా మాట్లాడిన మాటల వలన రష్మికను ట్రోల్ చేశారు. కన్నడ ఆదివాసీల సంప్రదాయం.. భూతకోల నేపథ్యంలో వచ్చిన కాంతార చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను చూశారా అని అడగ్గా.. ఇంకా చూడలేదని ఆన్సర్ ఇచ్చి చిక్కుల్లో పడింది రష్మిక. దీంతో ఆమెపై నెటిజన్స్ సీరియస్ అయ్యారు.

అలాగే.. తనను కథానాయికగా పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా చేతి వేళ్లతో చూపించడం.. ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ రిషబ్ శెట్టి కౌంటరివ్వడంతో రష్మికపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోసారి.. హిందీ చిత్రాల్లో మాత్రమే రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయని.. సౌత్ సినిమాల్లో కేవలం మసాలా సాంగ్స్ ఉంటాయంటూ మిషన్ మజ్ను ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ తో మరోసారి నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న రష్మిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన తాను ఎంతగా బాధపడిందో చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో చిత్రపరిశ్రమను వదిలేయాలని కూడా అనుకున్న సందర్భాలున్నాయని తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

రష్మిక మాట్లాడుతూ.. “ప్రజలు నా శరీరంతో ఇబ్బందిపడుతున్నారు. నేను ఎక్కువగా పనిచేస్తే మనిషిలా కనిపిస్తాను. లేదు పనిచేయకుండా కూర్చుంటే చాలా లావుగా అయిపోతాను. నేను ఎక్కువగా మాట్లాడతాను. అలాగే ఎక్కువగా బాధపడతాను. ఒకవేళ నేను అస్సలు మాట్లాడకపోతే.. నాకు అహంకారం అంటారు. నేను ఊపిరి పీల్చుకోవడం.. లేదా శ్వాస తీసుకోకపోవడం కూడా ప్రజలకు ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు ? నేను ఉండాలా ? లేదా వెళ్లిపోవాలా?” అంటూ ప్రశ్నించింది.

అలాగే.. “మీరు నాకు క్లారిటీ ఇవ్వకోతే.. నేను ఏం చేయాలి ? నాకు క్లారిటీ ఇవ్వండి. మీకు నాతో సమస్య ఉంటే.. అదేంటో చెప్పండి. కానీ కొన్నిసార్లు మీరు ఉపయోగించే పదాలు.. మాటలు.. మానసికంగా ఇబ్బంది పెడతాయి. ” అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే రష్మిక పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొననుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu