AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. సూపర్‏స్టార్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..

ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. సూపర్‏స్టార్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ..
Mahesh Babu, Malaika
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2023 | 3:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం.. మహేష్ నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.. కీలకపాత్రలో శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులున్న సినిమాగా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నారట. అయితే మహేష్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ పాట కోసం ఆమెను సంప్రదించేందుకు సిద్ధమయ్యారట చిత్రయూనిట్. ఇప్పటికే మలైకా తెలుగులో పలు స్పెషల్ సాంగ్స్ చేసింది. గతంలో మహేష్ నటించిన అతిథి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ చేసింది మలైకా. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోనూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక తెలుగులో మలైకా చేసిన అన్ని స్పెషల్ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆడిపాడనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజామెంతో తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ