Balakrishna vs Akkineni: బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్..

తాజాగా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. ఆ కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Balakrishna vs Akkineni: బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్..
Akkineni, Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 24, 2023 | 3:16 PM

వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‏లో పాల్గొన్న నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్‍లో ఏఎన్ఆర్.. ఎస్వీ రంగారావులను ఉద్దేశిస్తూ బాలయ్య మాట్లాడిన మాటలపై ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ సీరియస్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో నందమూరి.. అక్కినేని వారసుల మధ్య వార్ మొదలైంది. ఇక బాలయ్య మాటలపై సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఆర్ కుటుంబానికి క్షమపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. ఆ కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

“సినిమా హీరో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణగారు తన సినిమా సక్సెస్ మీట్ లో వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో స్టేజ్ మీద మాట్లాడటం తన అహంకార పూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మద్రాసులోనే అంతం అవకుండా మొట్ట మొదట హైదరాబాదా కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎంతో సేవలు చేసేలా చేసి.. తన నటనతో.. సేవాభావంతో ఎంతో మందికి ఆర్టిస్ట్ లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ గారి అహంకారం మాటలు మేము కండిస్తున్నాము.

ఇవి కూడా చదవండి

మీ నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే.. మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆరోజు మీ నాన్న నీకు చెప్తే ఈరోజుకు ఒక కొడుకుగా నెరవేర్చాలని లేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అంటూ మేము ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని అభిమానులకు సంస్కారం ఉంది. కావున ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిబెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది” అంటూ లేఖ విడుదల చేశారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే