AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: ఫలించిన క్షణాలు.. ‘కాంతార’ చిత్రయూనిట్‏కు నిజ జీవితంలో దైవానుగ్రహం.. వీడియో చూడండి..

నిజజీవితంలో కాంతాత బృందానికి దైవానుగ్రహం లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియో షేర్ చేసింది.

Kantara: ఫలించిన క్షణాలు.. 'కాంతార' చిత్రయూనిట్‏కు నిజ జీవితంలో దైవానుగ్రహం.. వీడియో చూడండి..
Kantara
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2023 | 9:30 PM

Share

కన్నడ డైరెక్టర్ కమ్ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడలోనే కాకుండా..తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కర్ణాటక ఆదివాసీల ఆచార సంప్రదాయాలు… భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో చివరి 20 నిమిషాలు రిషబ్ నటనకు గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. చివరలో రిషబ్ శెట్టి భూతకోల ఆడే వ్యక్తిగా మారడం.. తన భూమిని కాపాడినందుకు కృతజ్ఞతగా అక్కడున్న పోలీసు అధికారిని.. ఇతర గ్రామస్తలును తన దగ్గరకు తీసుకోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఇప్పుడు అలాంటి ఘటనే కాంతారా చిత్రయూనిట్ కు ఎదురైంది. నిజజీవితంలో కాంతాత బృందానికి దైవానుగ్రహం లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియో షేర్ చేసింది.

అందులో రిషబ్ శెట్టి తన కుటుంబం.. సప్తమి గౌడతోపాటు హోంబలే నిర్మాతలు.. తులునాడులోని పంజుర్ల ఉత్సవానికీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటానికి సిద్ధం కావడం.. అతడిని ఆవహించడం చిత్రయూనిట్ చూశారు. అనంతరం దైవం ఆవహించిన వ్యక్తి రిషబ్ శెట్టిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాకుండా.. కాంతార టీంను దగ్గరకు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఫలించిన క్షణాలు.. ప్రకృతికి కట్టుబడి మనకు స్వేచ్చ, విజయాన్ని అందిస్తోన్న దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రాహాన్ని పొందింది. అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO