AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మన్మథుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెల్సా..? చూస్తే షాకే

చాలా తక్కువ సినిమాలు చేసిన అన్షు.. లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే పుట్టి పెరగడంతో ఇండస్ట్రీకి కూడా గెస్ట్‌లా వచ్చి వెళ్లింది.

Tollywood: మన్మథుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెల్సా..? చూస్తే షాకే
Anshu Ambani
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2023 | 4:19 PM

Share

కొంతమంది  హీరోయిన్స్.. ఇలా వస్తారు.. అలా ఇంప్రెస్ చేస్తారు.. ఆడియెన్స్ మనసుల్లో తమ మార్క్ వేస్తారు. అంతలోనే కనిపించకుండా మాయమైపోతారు. అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి బ్రతుకుతుంటారు. ఆ కోవకే చెందిన ఓ హీరోయిన్‌ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అక్కినేని అందగాడు నాగార్జున.. రొమాంటిక్ పాత్రలో నటించిన మన్మథుడు సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందిచారు. నాగర్జున కెరీర్‌లో ఈ మూవీ ఓ క్లాసిక్. ఇప్పడు టీవీలో ప్రసారమవుతున్నా కూడా వీక్షకులు అలా సినిమాలో లీనమైపోతుంటారు. కాగా ఈ సినిమాలో  సోనాలి బింద్రే, అన్షు అంబానీ… ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారు. ఆ ఇద్దరితోనూ నాగార్జున లవ్ ట్రాక్స్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి.

మెయిన్‌గా చెప్పాలంటే.. అన్షు పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా చూశాక కూడా ఆమె పాత్ర ఆడియెన్స్‌ను వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది అన్షు. ఈ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్‌తో రాఘవేంద్రలో యాక్ట్ చేసింది. అయితే యాధృచ్చికంగా ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె మరణించే పాత్రలే చేసింది. ఇక నీలకంఠ తీసిన మిస్సమ్మ మూవీలోనూ ఓ గెస్ట్ రోల్‌లో మెరిసింది. చాలా తక్కువ మూవీస్ చేసిన అన్షు.. లండన్‌ వెళ్లిపోయి.. అక్కడే సెటిలైపోయింది.  అక్కడే పుట్టి పెరిగిన ఈ నటి.. సినిమా పరిశ్రమకు కూడా ఓ అతిథిలా వచ్చి వెళ్లింది. లండన్‌లోనే వ్యాపారవేత్త సచిన్ సగ్గార్‌ను  వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ఈమె లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ రన్ చేస్తుంది. సినిమాల్లో నటించి 20 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఆమె అంతే చెక్కుచెదరని అందంతో ఉంది.

అన్షు ఫిల్మ్ ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ అవ్వనున్నట్లు మొన్నామధ్య రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అయితే అన్షు సన్నిహితులు మాత్రం ఇవి గాలి వార్తలని కొట్టి పారేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?