AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆదిపురుష్ రిలీజ్ పై మరోసారి సందిగ్ధత.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

ఆదిపురుష్ సినిమాను 2023 జూన్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

Prabhas: ఆదిపురుష్ రిలీజ్ పై మరోసారి సందిగ్ధత.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2023 | 6:48 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు డైరెక్టర్ మారుతి రూపొందిస్తోన్న సినిమా చిత్రీకరణ కూడా సైలెంట్‏గా జరిగిపోతుంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. అయితే గతంలో రిలీజ్ చేసిన టీజర్ పై విమర్శలు రావడంతో సినిమా వీఎఫ్ఎక్స్ మార్చే పనిలో పడ్డారు మేకర్స్. దీంతో సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాను 2023 జూన్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కాదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ కావడం ఖాయమంటూ నిర్ధారిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభాస్ రాముడిగా కనిపించడానికి ఇంకా 150 రోజులు ఆగాల్సిందే. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రామయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే సన్నీ సింగ్,సోనాల్ చౌహాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ ఈ పౌరాణిక సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ