Saptami Gowda: కాంతార హీరోయిన్‏కు బంపర్ ఆఫర్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో సప్తమి..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కంతార ఫేమ్ సప్తమి గౌడ. గతేడాది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.

Saptami Gowda: కాంతార హీరోయిన్‏కు బంపర్ ఆఫర్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో సప్తమి..
Saptami
Follow us

|

Updated on: Jan 15, 2023 | 2:52 PM

కన్నడ డైరెక్టర్ రిషభ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం అందుకున్న విజయం గురించి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించింది. ఇందులో రిషభ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఆయనకు జోడిగా సప్తమి గౌడ నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గతేడాది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆస్కార్ 2023 కోసం షార్ట్‌లిస్ట్ అయ్యింది. ప్రస్తుతం వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వాక్సిన్ వార్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కోవిడ్-19, దేశంలోని వాక్సిన్ డ్రిల్స్ నేపధ్యంలో ఉండబోతుంది. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు.

ఈ సినిమా చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. భారతదేశం అంతటా చిత్రీకరించిన తర్వాత, ది వాక్సిన్ వార్ చివరి బ్యాటిల్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. తాజాగా కాంతార ఫేమ్ సప్తమి గౌడ ఈ పాన్ ఇండియా చిత్రంలో చేరారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్ అయింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

2023 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పే చిత్రాలని రూపొంచే ఫిల్మ్ మేకర్. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.