AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Ajrun: అభిమానులతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్ మూమెంట్.. ఫోటోస్ వైరల్..

చాలా సంవత్సరాల అనంతరం చిరు, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మెగా, మాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శుక్రవారం ఉదయం డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. చిత్రయూనిట్ అభిమానులతో కలిసి వాల్తేరు వీర్యయ చిత్రాన్ని వీక్షించారు

Allu Ajrun: అభిమానులతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్ మూమెంట్.. ఫోటోస్ వైరల్..
Allu Arjun, Waltair Veerayy
Rajitha Chanti
|

Updated on: Jan 14, 2023 | 3:04 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్.. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజే రూ. 29 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించారు. చాలా సంవత్సరాల అనంతరం చిరు, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మెగా, మాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శుక్రవారం ఉదయం డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. చిత్రయూనిట్ అభిమానులతో కలిసి వాల్తేరు వీర్యయ చిత్రాన్ని వీక్షించారు. మెగాస్టార్ వీరాభిమాని అయిన డైరెక్టర్ బాబీ, డీఎస్పీ గాల్లోకి పేపర్స్ విసురుతూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నిన్న చిరు కూతర్లు.. సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల సైతం ఫ్యాన్స్ మధ్య వాల్తేరు వీరయ్య చిత్రాన్ని చూశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మూవీ వీక్షించారు.

హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో అభిమానులతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వాస్తవానికి బన్నీ కూడా మెగాస్టార్ వీరాభిమాని. గతంలో అనేకసార్లు తాను చిరుకు వీరాభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇది బన్నీ ఫ్యాన్ మూమెంట్ అంటూ ఫోటోస్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బన్నీ.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రష్మిక మందన్నా, ఫహాద్ ఫజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన పుష్ప చిత్రానికి మించి ఈ మూవీ సీక్వెల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
అందుకే నేను ఇస్లాం మతంలో మారిపోయాను
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
సిటీలో సీరియల్ కిల్లర్..OTT ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
అరటిపండు హ్యాక్‌తో కుండీలోనే మిరియాల మొక్క.. సీక్రెట్ ట్రిక్!
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
ఫ్రిజ్‌లో మాంసం ఫ్రెష్‌గా ఉందా.. ప్యాకెట్‌ తెరవకుండానే చెప్పొచ్చు
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
అబ్బా... పెసరపప్పుతో డ్రై ఫ్రూట్ లడ్డూలు.. రుచి ఇంత బాగుంటుందా..
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!
తెలంగాణలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!