Bandla Ganesh: బండ్ల గణేష్ కుమారుడిని చూశారా? సోదరి పెళ్లి వేడుకల్లోడ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.. వీడియోలు ఇదిగో
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో శుభకార్యం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన సంగీత్ లో బండ్లన్న కుమారుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె పెళ్లి వేడుక ఈ నెల 16న ఉదయం గ్రాండ్ గా జరగనుంది. సూర్య తేజ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది జనని. ఈ క్రమంలో తన కుమార్తె పెళ్లి వేడుక కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేయిస్తున్నారు బండ్లన్న. టాలీవుడ్ లో సినీ ప్రముఖులందరితో పాటు , రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులను కూడా ఇంటికెళ్లి మరీ పెళ్లి పత్రికలు ఇచ్చి మరీ తన కూతురి పెళ్లికి ఆహ్వానించారీ ప్రముఖ నిర్మాత. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలైన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం సరిగ్గా 11 గంటల 58 నిమిషాలకు జనని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు సూర్య తేజ. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఆద్యంతం ఎంతో సరదాగా సాగిపోయిన ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు హితేష్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.
సంగీత్ లో భాగంగా పలు సినిమా పాటలకు ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్స్ లు వేశాడు హితేష్. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఇతను వేసిన స్టెప్పులు చూసి అక్కడున్నవారందరూ చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇక బండ్లన్న అయితే తన కుమారుడి డ్యాన్స్ ను చూస్తూ ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ మురిసిపోయాడు. బండ్లన్న కుమారుడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బండ్లన్న కుమారుడా? మజాకా? హితేష్ డ్యాన్స్ అదరగొట్టిండు. భవిష్యత్ లో హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ హితేష్ ను మెచ్చుకుంటున్నారు.
ఎన్టీఆర్ టెంపర్ పాటకు బండ్లన్న కుమారుడి డ్యాన్స్..
View this post on Instagram
కాగా బండ్ల గణేష్ కుఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హితేష్ పెద్ద కొడుకు కాగా రెండు కుమారుడి పేరు హిరేష్. ఇక పెళ్లి కూతురు జనని కూడా సంగీత్ లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ లు వేసింది. పాటలు కూడా పాడింది.
రామ్ చరణ్ పాటకు..
View this post on Instagram
బండ్లన్న ఆనందం..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




