Bigg Boss Telugu 10: టాలీవుడ్ స్టార్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం.. బిగ్‌బాస్10లోకి కాంట్రవర్సీ క్వీన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏదీ లేదు. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో ఒక కాంట్రవర్సీ క్వీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ఈసారి మరిన్ని హంగులు, ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కోసం ఈసారి మరింత అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కామన్ కంటెస్టెంట్ల ఎంపిక కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ప్రారంభమైంది. అలాగే ఈ షోకు సంబంధించి వరుసగా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు వైరల్ అవుతున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలో మరో పేరు చేరింది. ఆమె మరెవరో కాదు కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ మౌనీషా చౌదరి.
ఎక్కువగా అమెరికాలో ఉండే మౌనీషా చౌదరి రీసెంట్ గా ఇండియాకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసమే ఇండియాకు వచ్చారని తెలుస్తోంది. 2016లో ‘మిస్ ఆసియా ఉతా’గా కిరీటం కున్న మౌనీషా చౌదరి అలియాస్ స్నో అక్క కుసోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులతోనూ ఆమెకు మంచి పరిచయం ఉంది. తెలుగులో ఏ కొత్త సినిమా రిలీజైనా ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్స్ కు ముందుంటుంది. మంచు విష్ణు కన్నప్ప మొదలు, దీవానా, చెన్నై లవ్ స్టోరీ రీసెంట్ గా కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లోనూ పార్టిసిపేట్ చేసింది మౌనీషా.
కాగా కొన్ని రోజుల క్రితం ఓ టాలీవుడ్ బడా దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది మౌనీష. సినిమా హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ వాపోయింది. సదరు డైరెక్టర్ తన థైస్ సైజ్ గురించి అడిగాడని, ఆ సమయంలో ఆ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ, ఆ డైరెక్టర్ ఇప్పుడు పెద్ద స్టార్స్‌తో పెద్ద సినిమాలు తీస్తున్నాడని మౌనీషా పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మౌనీషా పేరు నెట్టింట మార్మోగిపోయింది. అయితే ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు మౌనీష. ఈ క్రమంలోనే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వమున్న మౌనీషాను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసిందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




