AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 09) సందర్భంగా అతనికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సినిమా రంగంలో స్టార్స్ గా కొనసాగుతోన్న ఓ ముగ్గురు ప్రముఖులు మహేష్ బాబుకు క్లాస్ మేట్స్ అని తెలిసింది.

Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్
Mahesh Babu Birthday
Basha Shek
|

Updated on: Aug 09, 2026 | 7:05 PM

Share

ఇవాళ (ఆగస్టు 09)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం వంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు పేరు మార్మోగుతుంది. సూపర్ స్టార్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇదే క్రమంలో మహేష్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్స్ గా వెలుగొందుతోన్న ముగ్గురు ప్రముఖులు మహేష్ బాబుకు క్లాస్ మేట్స్ అట. వీరందరూ కలిసి ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారట. హైదరాబాద్ కు రాకముందు అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. తెలుగు సినిమా నటులు కూడా అక్కడే ఉండేవారు. టాలీవుడ్, కోలీవుడ్ నటుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఇదే క్రమంలో రెండు పరిశ్రమలకు చెందిన నటీనటుల పిల్లలు కూడా కలిసి చదువుకునే వారు.

ఇక మహేష్ బాబు కూడా దాదాపు 25 సంవత్సరాల పాటు చెన్నైలో పెరిగారు. అక్కడి సెయింట్ పీటర్స్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడీ సూపర్ స్టార్. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఆయనకు స్కూల్ మేట్స్ గా ఉన్నారట. వీరిందరూ కలిసి చదువుకున్నారట. ఈ విషయాన్ని సూర్య, కార్తీ కూడా పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో హీరో సూర్య మాట్లాడుతూ..’ స్కూల్ లో మహేష్, తాను మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమని చెప్పారు. క్లాసులో బెంచీలు ఎక్కి దూకడంతో పాటు బాగా అల్లరి చేసే వాళ్లమన్నారు. మహేష్ ఎప్పుడు చెన్నైకి వచ్చినా, చిన్న నాటి స్నేహితులను కలిసి సరదాగా గడుపుతారని సూర్య చెప్పుకొచ్చారు. మహేష్ బాబు బర్త్ డే నేపథ్యంలో మరోసారి ఈ విషయం వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నాడు మహేష్. యాక్షన్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us