AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: ‘చిరంజీవి గారూ నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్..

చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన

Devi Sri Prasad: 'చిరంజీవి గారూ నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు'.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్..
Devi Sri Prasad, Chiranjeev
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2023 | 3:10 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకాగ ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా.. థియేటర్లలో మెగా అభిమానులకు.. ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటించగా.. కీలకపాత్రలో మాస్ మాహారాజా రవితేజ నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచింది. అల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకలు లోడింగ్, నీకేమో అందం ఎక్కువ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ వాల్తేరు వీరయ్య గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

వాల్తేరు వీరయ్య సినిమా గురించి దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు దర్శకుడు బాబీ గురించి చెప్పాలి. బాబీ తో నాకు చాలా అనుబంధం వుంది. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు హిట్ కావడానికి కారణం బాబీ గారు చెప్పిన సబ్జెక్ట్, నాపై పెట్టుకున్న నమ్మకం.. అన్నిటికి మించి బాస్ మెగాస్టార్ మా ఇద్దరిపై పెట్టుకున్న పెట్టుకున్న నమ్మకం. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనే బాబీ డ్రీమ్ నేలవేరడం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ గారిని తీసుకురావడం బాబీ వలనే సాధ్యమైయింది. ఇందులో రవితేజ గారిది చాలా కీలకమైన పాత్ర.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి చిరంజీవి గారితో ఒకే ఒక మాట చెప్పా. ‘’నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’’ అని చెప్పా. ఆయన కాసేపు మౌనంగా వుండి.. ‘’ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’’ అన్నారు. ఇందులో కంటతడితో నవ్వుతూ క్లాప్స్ కొట్టే సీన్స్ చాలా వుంటాయి. బాబీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రవితేజ, చిరంజీవి గారి సీన్స్ కి క్లాప్స్ మాములుగా వుండవు. మాస్ యుఫోరియా మాములుగా వుండదు. బాస్ ని మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ వాటితో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా వున్నాయి. కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ .. అన్నీ కుమ్మేశారు.” అంటూ చెప్పుకొచ్చారు.

సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..