Veera Simha Reddy Review: బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ రివ్యూ..

బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదల అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నే అంచనాలతో వచ్చింది వీరసింహారెడ్డి.

Veera Simha Reddy Review: బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' రివ్యూ..
Veera Simha Reddy
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Anil kumar poka

Updated on: Jan 17, 2023 | 12:54 PM

మూవీ రివ్యూ:  వీర సింహా రెడ్డి

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు, సప్తగిరి, పి. రవిశంకర్, అజయ్ ఘోష్, సప్తగిరి త‌దిత‌రులు.

డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ : రిషి పంజాబి

సంగీత దర్శకుడు : ఎస్ఎస్. తమన్

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని

విడుదల తేదీ: జనవరి 12, 2022

బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదల అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నే అంచనాలతో వచ్చింది వీరసింహారెడ్డి. మరి బాలయ్య ఈ సినిమాతో మ్యాజిక్ చేసాడా..? ఫ్యాక్షన్ డ్రామాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడా..? పండక్కి చిరంజీవి కంటే ముందుగా వచ్చిన బాలయ్య సినిమా ఎలా ఉంది..?

కథ:

వీరసింహారెడ్డి (బాలకృష్ణ) రాయలసీమలో పెద్ద నాయకుడు. గుడి లేని దేవుడిగా ఆయన్ని చూస్తుంటారు ప్రజలు. సీమ జనానికి ఏ కష్టం వచ్చినా ప్రాణాన్ని సైతం లెక్క చేయని నాయకుడు ఆయన. ఆయన చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్)కు మాత్రం అన్నంటే కోపం.. ద్వేషం. చంపేయాలి అనేంత కసి ఉంటుంది. వీరసింహారెడ్డి పక్కూళ్ళో ఉండే మరో ఫ్యాక్షనిస్ట్ ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్). ఈ ఇద్దరూ వీరసింహారెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అన్నను ప్రాణంగా ప్రేమించిన చెల్లే.. అతన్ని ఎందుకు చంపాలనుకుంటుంది..? మధ్యలో జయసింహారెడ్డి (బాలకృష్ణ) ఎందుకు వచ్చాడు..? సీమకు దూరంగా జయసింహా ఎందుకు అస్తాంబుల్‌లో ఎందుకు పెరగాల్సి వచ్చింది..? అసలు ప్రతాప్ రెడ్డితో వీరసింహారెడ్డి వైరానికి కారణమేంటి అనేది మిగిలిన కథ..

కథనం:

బాలయ్య ఫ్యాక్షన్ డ్రామా చేస్తున్నాడంటే.. అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరసింహారెడ్డి అదే స్థాయిలో వచ్చింది. కాకపోతే ఈ సినిమాలో సోల్ మిస్ అయినట్లు స్క్రీన్ మీద చూస్తుంటే అర్థమవుతుంది. చేతిలో కత్తి.. నరకడానికి ఎదురుగా ఓ మనిషి ఉంటే.. ఎంతమందిని నరుకుతున్నాడో తెలియకుండా అందర్నీ నరికేస్తుంటాడు బాలయ్య. ఆయనలా నరుకుతుంటే ఫ్యాన్స్‌కు కూడా పూనకాలు వస్తుంటాయి. కానీ మరీ ఎమోషన్ లేకుండా నరుకుతుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. వీరసింహారెడ్డిలో ఇదే జరిగిందేమో అనిపిస్తుంది. కథ రాసుకున్నాక బాలయ్యను అనుకున్నారో.. లేదంటే బాలయ్య డేట్స్ ఇచ్చాడు కదా ఈ కథను చుట్టేసారో అర్థం కాలేదు. రొటీన్ సినిమాలతో కూడా బాలయ్య గతంలో మ్యాజిక్ చేసాడు.. వీరసింహారెడ్డిలో మాత్రం కథ అంతకంటే రొటీన్‌గా ఉంది. ఫస్టాఫ్‌లో పెద్దాయన కారెక్టర్ ఎంటరైన తర్వాత.. అరగంట పాటు ఊపేసాడు గోపీచంద్ మలినేని. అదే ఊపు ఇంకాసేపు ఉండుంటేనా థియేటర్లలో వీరసింహుడి మోత మోగిపోయేది. పొలిటికల్ డైలాగులు కూడా బాగానే హీట్ పెంచేసాయి. సాయి మాధవ్ బుర్రా మాటలు చాలా పదునుగా ఉన్నాయి. బాలయ్య ఉండటంతో చాలా సెటైర్లు కూడా వేయించాడు బుర్రా. మంచి ట్విస్టుతో ఇంటర్వెల్ ఇచ్చినా.. సెకండాఫ్ మాత్రం తేలిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్‌తో సెంటిమెంట్ సీన్స్ అక్కడక్కడా పర్లేదు. బాలయ్య ఉన్నాడు.. 4 యాక్షన్ సీక్వెన్సులు రాసుకుందాం. మధ్యలో ఏదో ఒక కథ పెట్టేసి అల్లేద్దాం అన్నట్లే అనిపించింది. మనం బాలయ్యను చూసుకుంటే.. బాలయ్య ఇమేజ్ సినిమాను చూసుకుంటుందిలే అని నమ్మినట్లున్నాడు గోపీచంద్ మలినేని. మొదటి 15 నిమిషాలు రొటీన్‌గా మొదలైంది.. ఆ తర్వాత పెద్దాయన పాత్ర వస్తుంది. ప్రస్తుత గవర్నమెంట్‌పై పంచులు బాగా పడ్డాయి. అవన్నీ అభిమానులను బాగా నచ్చడం ఖాయం. సెకండాఫ్ మాత్రం సెంటిమెంట్ సీన్స్ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అదే ఆయువు పట్టు సినిమాకు కానీ అక్కడే మిస్ ఫైర్ అయిందేమో అనిపిస్తుంది. ఎంతసేపూ బాలయ్య ఎలివేషన్‌పైనే ఫోకస్ చేసారు కానీ ఎమోషన్ సీన్స్ వదిలేసారు.

నటీనటులు:

వీరసింహారెడ్డిగా విజృంభించాడు బాలయ్య.. ఆయనకు ఇలాంటి పాత్ర కొట్టిన పిండి. కాకపోతే ఆయన డెత్ సీన్ అంతమంది జనం మధ్య అలా షూట్ చేయకుండా ఉండాల్సింది. ఎంత సినిమా అయినా చూడ్డానికి ఏదోలా అనిపించింది. శృతి హాసన్ సినిమాలో ఉంది.. జస్ట్ ఉంది అంతే. రెండు పాటలు.. నాలుగు సీన్లతో సరిపెట్టేసారు. దునియా విజయ్ విలనిజం పరమ రొటీన్‌గా అనిపించింది.. కేవలం బాలయ్యతో తన్నులు తినడానికే ఈయన పాత్ర డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. లాల్ కారెక్టర్ బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర బాగుంది. క్రాక్ తర్వాత మరో మంచి పాత్ర పడింది ఈమెకు. మిగిలిన వాళ్లంతా పరిధి మేర నటించారు.

టెక్నికల్ టీం:

అఖండకు రీ సౌండ్ వచ్చేలా వాయించిన థమన్.. ఈ సారి జస్ట్ ఓకేతో సరిపెట్టేసాడు. పాటలు బాగున్నాయి.. ఆర్ఆర్ పర్లేదు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. వైడ్ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కాస్త వీక్. లెంత్ చాలా ఎక్కువైంది. సెకండాఫ్ మరీ ముఖ్యంగా స్లోగా సాగింది. గోపీచంద్ మలినేని కథ కంటే ఎక్కువగా బాలయ్యపై ఫోకస్ చేసారని అర్థమవుతుంది. ఆయనున్నాడు కదా అని యాక్షన్ సీక్వెన్సులు రాసుకున్నాడు.. సినిమాలో అవి మాత్రమే హైలైట్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా వీరసింహారెడ్డి.. మరో బాలయ్య మార్క్ పరమ రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?