RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. అద్భుతమైన ఆలోచన వచ్చిందట.. ఏంటంటే..

జక్కన్న మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని..ఇప్పుడు సీక్వెల్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. అద్భుతమైన ఆలోచన వచ్చిందట.. ఏంటంటే..
Rajamouli
Follow us

|

Updated on: Jan 11, 2023 | 3:07 PM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‏లో 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్ట్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఈ గోల్డెన్ గ్లోబ్ ఒకటి. ఇందులో బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఈ వేడుకకు డైరెక్టర్ రాజమౌళితోపాటు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని..ఇప్పుడు సీక్వెల్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

“ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మాకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. అయితే బలవంతంగా సీక్వెల్ తీయకూడదని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ కు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత ఇతర చిత్ర బృందంతో కలిసి మా నాన్నతో సీక్వెల్ పై చర్చించాను. అప్పుడే ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించాం. అయితే స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో ముందుకెళ్లలేం. ప్రస్తుతం మేమంత అదే పనిలో ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అని అడగ్గా.. వారిని నేనెప్పుడూ బాధపెట్టలేదు.. వారిని పసిపిల్లల మాదిరిగానే చూసుకున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.

Latest Articles