AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన నాని దసరా చిత్రయూనిట్.. ఆ వీడియోను షేర్ చేయకండి అంటూ విజ్ఞప్తి..

నాని నటిస్తోన్న దసరా సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది గమనించిన మేకర్స్.. ట్విట్టర్ వేదికగా అభిమానులకు రిక్వెస్ట్ చేశారు

Dasara: ఫ్యాన్స్‏కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన నాని దసరా చిత్రయూనిట్.. ఆ వీడియోను షేర్ చేయకండి అంటూ విజ్ఞప్తి..
Nani, Dasara Movie
Rajitha Chanti
|

Updated on: Jan 09, 2023 | 3:10 PM

Share

డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఫుల్ ఊర మాస్ లుక్ లో కనిపించనుండగా.. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిగా ఉండగా.. ఇటీవల విడుదలైన మాస్ సాంగ్ సినిమా ఎలా ఉండబోతుందో చూపించింది. అయితే ఆకస్మాత్తుగా ఈ సినిమాకు షాక్ తగిలింది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది గమనించిన మేకర్స్.. ట్విట్టర్ వేదికగా అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. నెట్టింట వైరలవుతున్న ఆ లీక్డ్ వీడియోను ఎవరు షేర్ చేయొద్దని.. మరికొద్ది రోజుల్లో సాలిడ్ అప్డేట్ ఇస్తామని.. అప్పటివరకు ఓపిక పట్టాలని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్‏కు విజ్ఞప్తి చేశారు.

ఈ చిత్రంలో సముద్రఖని, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, మీరా జాస్మిన్, జరీనా వహాబ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా అనంతరం నాని నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 చిత్రంలో నటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!