AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: ఆ సీన్ చేసేటప్పుడు విజయ్‏ను అతని తండ్రి తిట్టాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్ సంఘవి..

ఒకప్పుడు వరుస సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగిన సంఘవి కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను వర్క్ చేసిన స్టార్స్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తమిళ్ స్టార్ దళపతి విజయ్‏తో ఆమె జోడిగా నటించిన రసిగన్ చిత్ర రోజులను గుర్తుచేసుకున్నారు.

Vijay Thalapathy: ఆ సీన్ చేసేటప్పుడు విజయ్‏ను అతని తండ్రి తిట్టాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్ సంఘవి..
Sangavi
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2023 | 7:14 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా రాణించింది నటి సంఘవి. తమిళ్ స్టార్ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత తమిళ్.. తెలుగు భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగిన సంఘవి కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తాను వర్క్ చేసిన స్టార్స్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తమిళ్ స్టార్ దళపతి విజయ్‏తో ఆమె జోడిగా నటించిన రసిగన్ చిత్ర రోజులను గుర్తుచేసుకున్నారు సంఘవి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చారు.

విజయ్ తండ్రి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ తన కుమారుడిని ప్రధాన పాత్రలో రసిగన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సంఘవి హీరోయిన్. ఈ మూవీలో ఓ సీన్ లో చల్లటి నీటిలో స్నానం చేసే సీన్ ఉందని.. ఆ సమయంలో విజయ్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యాడని… దీంతో ఆయన తండ్రి అతడిని తిట్టాడని చెప్పుకొచ్చింది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అందులో మేం స్నానం చేసి బయటకు రావాలి. నేను తొందరగా చేసేశాను. కానీ విజయ్ చాలా ఇబ్బంది పడ్డాడు. విపరీతంగా చల్లగా ఉండడంతో వణికిపోయాడు. దీంతో ఆయన తండ్రి చంద్రశేఖర్.. ఆ అమ్మాయి చేస్తోంది. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావ్ ? అంటూ విజయ్ పై సీరియస్ అయ్యారు. విజయ్ నుంచి క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నాను. అతను చెప్పిన సమయానికి కంటే 30 నిమిషాల ముందే మేకప్ తో సెట్స్ పై సిద్ధంగా ఉంటాడు. ఆ సినిమాలో విజయ్ తో నటించడం చాలా నచ్చిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్.. సంఘవి కలిసి రసిగన్ చిత్రమే కాదు.. ఆ తర్వాత విష్ణు సినిమాలోని నటించారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ లో నటించినందుకు ఇద్దరి మధ్య ప్రేమ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.