Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput : సుశాంత్ ఇంట్లోకి మూడేళ్ల తర్వాత కొత్త ఫ్యామిలీ.. ఈసారి అద్దె కూడా ఎక్కువే..

సుశాంత్ ఉరివేసుకోవడం వలనే చనిపోయారంటూ పోలీసులు తెలిపారు. అయితే అభిమానుల సందేహాలకు మరింత బలం చేకూరుస్తూ.. సుశాంత్ బాడీగై గాయాలున్నాయని.. అతని గొంతు కట్ చేసి ఉందని.. కళ్లపై కొట్టినట్లుగా దెబ్బలు ఉన్నాయని.. అతని పోస్ట్ మార్టమ్ కు హజరైన సిబ్బంది రూప్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

Sushant Singh Rajput : సుశాంత్ ఇంట్లోకి మూడేళ్ల తర్వాత కొత్త ఫ్యామిలీ.. ఈసారి అద్దె కూడా ఎక్కువే..
Sushant Singh Rajput
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 8:26 AM

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ ఆ హీరో మృతిపై ఉన్న సందేహాలకు మాత్రం క్లారిటీ రావడం లేదు. అటు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుశాంత్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. తనది ఆత్మహత్య కాదు.. హత్యే అని అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు ముందు నుంచి వాదిస్తూనే ఉన్నారు. అయితే సుశాంత్ ఉరివేసుకోవడం వలనే చనిపోయారంటూ పోలీసులు తెలిపారు. అయితే అభిమానుల సందేహాలకు మరింత బలం చేకూరుస్తూ.. సుశాంత్ బాడీగై గాయాలున్నాయని.. అతని గొంతు కట్ చేసి ఉందని.. కళ్లపై కొట్టినట్లుగా దెబ్బలు ఉన్నాయని.. అతని పోస్ట్ మార్టమ్ కు హజరైన సిబ్బంది రూప్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ మరణంపై చర్చ మొదలైంది. తమ హీరోకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి అతడి ఫ్లాట్ ఖాళీగా ఉంది.

సుశాంత్ తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆ ఇంట్లో ఉండేందుకు ముందుకు వచ్చింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ రఫీక్ మర్చంట్ ఈ విషయాన్ని తెలిపారు.. “సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతడి ఫ్లాట్ లో ఉండేందుకు ఎవరు ముందుకు రాలేదు. కొందరు రావాలనుకున్నా.. చివరికి వారి కుటుంబం వద్దనడంతో ఆగిపోయారు. దీంతో ఇంటి యజమాని చాలా కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆ ఇంటి మీద ఉన్న భయాలు కాస్త తగ్గాయి. ఇప్పుడిప్పుడే ఆ ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే ఓ ఫ్యామిలీ అందులో ఉండేందుకు సిద్ధమైంది. వారి నుంచి రూ.5 లక్షలు అద్దె తీసుకుంటున్నాను. సెక్యూరిటీ డిపాజిట్ కిందరూ. 30 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఆరు నెలల రెంట్ తో సమానం ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మోంట్ బ్లాంక్ అఫార్ట్ మెంట్స్ లోని ఈ ఇల్లు సముద్రానికి ఎదురుగా ఉంటుంది. ఇది డ్యూప్లెక్స్ 4BHK. దాదాపు 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని కార్టర్ రోడ్ లో ఉంది. డిసెంబర్ 2019న ఈ ఇంట్లోకి సుశాంత్ సింగ్ అద్దెకు వచ్చారు. అప్పుడు నెలకు రూ. 4.51 లక్షలు అద్దె చెల్లించినట్లుగా తెలుస్తోంది.