AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికపై ట్రోల్స్ గురించి స్పందించిన కిచ్చా సుదీప్.. దారుణంగా గుడ్లు, రాళ్లు కూడా విసుతారంటూ..

కాంతార సినిమాను చూశారా అని అడగ్గా.. లేదని చెప్పింది రష్మిక. దీంతో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత పొగరు వచ్చిందంటూ ట్రోల్ చేశారు. తాజాగా రష్మిక పై వచ్చిన ట్రోల్స్ పట్ల కన్నడ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు.

Rashmika Mandanna: రష్మికపై ట్రోల్స్ గురించి స్పందించిన కిచ్చా సుదీప్.. దారుణంగా గుడ్లు, రాళ్లు కూడా విసుతారంటూ..
Rashmika Mandanna, Kichcha
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2023 | 7:56 AM

Share

డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కిరిక్ పార్టీ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక మందన్నా. ఆ తర్వాత చలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది. తెలుగుతోపాటు..తమిళం, హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అటు సక్సెస్ లు మాత్రమే కాదు.. ఇటు వివాదాలతోనూ సావాసం చేస్తుంది. గతేడాది కాంతార సినిమా విషయంలో ఆమెను దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమాను చూశారా అని అడగ్గా.. లేదని చెప్పింది రష్మిక. దీంతో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత పొగరు వచ్చిందంటూ ట్రోల్ చేశారు. తాజాగా రష్మిక పై వచ్చిన ట్రోల్స్ పట్ల కన్నడ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు.

కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ” 15-20 సంవత్సరాల క్రితం వార్తా ఛానెల్స్ మమ్మల్ని ఇంటర్వ్యూలు చేసేవి. ఆ సమయంలో దూరదర్శన్, పేపర్లు తప్ప మరేమి లే్వు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. దాని వల్ల అన్ని అసత్యపు వార్తలు వైరలవుతున్నాయి. దానిని ఎదుర్కొవడం మనం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడూ ముందుకు సాగిపోతుండాలి. సెలబ్రెటీలపై ప్రజలు పూలదండలు వేస్తారు. అలాగే రాళ్లు, గుడ్లు, టమోటాలు కూడా విసురుతుంటారు. మనం ఎల్లప్పుడూ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడం.. మరింత బలంగా మారడం చేస్తుంటారు. మనం ఏం మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడతాము.. ఏమి చెప్పాలి అనే విషయాలలో మనం ముందుగా ఓ నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాను.

ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉండాలనుకుంటున్నారు. అక్కడ 2 నుంచి 10 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అందుకే మీపై వస్తున్న వార్తలు నిజమా ? కదా? అనే విషయాలు తెలుసుకోవడం మంచిది. ” అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఇప్పుడు వరిసు సినిమాత సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..