Tamannah: తగ్గేదే లే అంటున్న మిల్కీబ్యూటీ.. న్యూఇయర్ సెలబ్రెషన్స్ కోసం తమన్నా ధరించిన టాప్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో గుప్పుమంటున్నాయి. ఇటీవల న్యూఇయర్ వేడుకల్లో అతనితో కలిసి తెగ ఎంజయ్ చేసిందని.. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది

Tamannah: తగ్గేదే లే అంటున్న మిల్కీబ్యూటీ.. న్యూఇయర్ సెలబ్రెషన్స్ కోసం తమన్నా ధరించిన టాప్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..
Tamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 7:42 AM

వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ అటు వెండితెరపై… ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంపై అగ్రకథానాయికగా కొనసాగుతుంది తమన్నా. అయితే కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ గురించి పలు రకాల వార్తలు వైరలవుతున్నాయి. ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో గుప్పుమంటున్నాయి. ఇటీవల న్యూఇయర్ వేడుకల్లో అతనితో కలిసి తెగ ఎంజయ్ చేసిందని.. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే వేడుకల్లో అతనితో తమన్నా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిందని.. అతనికి ముద్దులు పెడుతున్న వీడియో వైరల్ అయ్యిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

న్యూఇయర్ వేడుకల్లో మిల్కీబ్యూటీ పింక్ టాప్ ధరించింది. అయితే ఆమె వేసుకున్న ఈ పింక్ సీక్వెన్స్ టాప్ ధరించి సందడి చేస్తూ అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఆమె ధరించిన ఈ డ్రెస్ ధర అక్షరాల రూ. 2,27,830. గతంలోనూ కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లోనూ ఈ డ్రెస్ తో మెరిసింది. ప్రస్తుతం తమన్నా డ్రెస్ ప్రైస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

అయితే నటుడు విజయ్ వర్మతో ప్రేమ గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు మిల్కీబ్యూటీ స్పందించలేదు. వీరిద్దరు తమ రాబోయే ప్రాజెక్ట్ లవ్ స్టోరీస్ 2 సినిమా కోసం మొదటిసారి కలుసుకున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. చివరగా.. అలియా నటించిన డార్లింగ్స్ చిత్రంలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.