AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ‘నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు.. కోల్పోయిన క్షణాలు.. గెలిచిన ఆనందాలు’.. వైరలవుతున్న విజయ్ దేవరకొండ లేటేస్ట్ పోస్ట్..

విజయ్ కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి నెట్టింట యాక్టివ్ అవుతున్న రౌడీ.. ఆసక్తికర పోస్ట్స్ చేస్తున్నారు. తాజాగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Vijay Deverakonda: 'నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు.. కోల్పోయిన క్షణాలు.. గెలిచిన ఆనందాలు'.. వైరలవుతున్న విజయ్ దేవరకొండ లేటేస్ట్ పోస్ట్..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2023 | 10:34 AM

Share

ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ట్రైలర్, సాంగ్స్ తో హైప్ క్రియేట్ అయినా.. అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈసినిమా తర్వాత విజయ్ కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి నెట్టింట యాక్టివ్ అవుతున్న రౌడీ.. ఆసక్తికర పోస్ట్స్ చేస్తున్నారు. తాజాగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా విజయ్ షేర్ చేసిన ఫోటోపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

“మనమందరం ఎంతో సంతోషంగా నవ్వినప్పుడు.. నిశ్శబ్దంగా ఏడ్చిన క్షణాలు.. అనుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడు.. కొన్ని గెలిచినప్పుడు.. కొన్ని కోల్పోయిన క్షణాలు.. ఎన్నో అనుభవాలతో గడిపోయింది గతేడాది. అన్నింటి సమ్మేళనమే జీవితం. ప్రతిదానిని మనం సెలబ్రెట్ చేసుకోవాల్సిందే. హ్యాపీ న్యూఇయర్ మై లవ్స్.. హావ్ ఏ గ్రేట్ న్యూ ఇయర్ ” అంటూ పోస్ట్ చేస్తూ.. ఓ రిసార్ట్ లో నీళ్లలో దిగి ఎంజాయ్ చేస్తున్న ఫోటో జత చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. విజయ్ షేర్ చేసిన ఫోటోలో.. అదే స్థానంలో గతంలో రష్మిక కూడా ఫోటో దిగి షేర్ చేసింది. ఇక ఇప్పుడు వీరిద్దరు ఒకే స్థానంలో ఫోటోస్ దిగడంతో మరోసారి వీరిద్దరి ప్రేమ గురించి నెట్టింట వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సమంత, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.