Aha: ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన ఆహా..! సోషల్ మీడియాలో షేర్ చేయడం పై అసహనం..
100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అంటూ.. మొదలైన ఆహా.. ఇప్పుడు ఓటీటీ ఫీల్డ్‌లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. క్రేజీ కంటెంట్తో.. తెలుగు వారినందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల తమిళ్లో కూడా తన జెర్నీని స్టార్ట్ చేసి..
100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అంటూ.. మొదలైన ఆహా.. ఇప్పుడు ఓటీటీ ఫీల్డ్‌లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. క్రేజీ కంటెంట్తో.. తెలుగు వారినందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఇటీవల తమిళ్లో కూడా తన జెర్నీని స్టార్ట్ చేసి.. కోలీవుడ్ ప్రేక్షకులకు కూడ చేరువవుతోంది. అయితే అలాంటి ఆహా ప్లాట్ ఫాం తాజాగా కోర్టు మెట్లెక్కింది.ఎస్ ! ఆహా ప్రెస్టీజియస్ షో… అన్‌స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు.. ఇప్పుడు ఆ షోను.. అన్‌అఫీషియల్ గా కొంత మంది సోషల్ మీడియాలో స్ట్రీమ్ చేస్తుండడం పై సీరియస్ అయ్యింది ఆహా. తన షోకు సంబంధిచిన వీడియోలను కాని.. ప్రోమోలను కాని సోషల్ మీడియాలో షేర్ చేయడం పై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో ఓ వ్యాజ్యాన్ని ధాఖలు చేసింది.ఇక ఈ వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు .. అర్హ మీడియా బ్రాడ్ కాస్టింగ్ కు అనుకులంగా తీర్పు నిచ్చింది. ఈ టాక్ షో అన్‌అఫీషియల్ స్ట్రీమింగ్ అండ్ అప్‌లోడ్స్ నిలిపివేయానలి అందరికీ ఆదేశాలిచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos