School childrens: స్కూల్ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!
మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని చెప్పాల్సిన గురువులే.. వాటిని పిల్లలకు నూరిపోస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లా కన్య ప్రాథమిక పాఠశాల ఇందుకు వేదికగా మారింది.
మూఢ నమ్మకాలను విశ్వసించవద్దని చెప్పాల్సిన గురువులే.. వాటిని పిల్లలకు నూరిపోస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లా కన్య ప్రాథమిక పాఠశాల ఇందుకు వేదికగా మారింది. స్కూల్లో సోమవారం మధ్యాహ్న భోజనం తిన్నాక 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం.. బాలికలకు ఆత్మలు ఆవహించాయని స్కూలు యాజమాన్యం మాంత్రికుడిని పిలిపించింది. పిల్లల ఆరోగ్యం పాడవటానికి పాఠశాలలో ఉన్న దెయ్యమే కారణమని ‘ఉపశమనం’ చేయించారు. బాలికల వయసు 9 – 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా సబ్ డివిజనల్ కలెక్టర్ అరుణ్ దీక్షిత్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
Published on: Dec 31, 2022 08:48 AM
వైరల్ వీడియోలు
Latest Videos