Car accident: డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.
ఓ డ్రైవర్ ర్యాష్‌గా వెళ్తూ రోడ్డుపై ఉన్న నీటిని పక్కనే వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై చిమ్ముకుంటూ వెళ్లాడు. దాంతో అతన్ని వెంబడించి నీళ్లెందుకు చిమ్మావని అడిగినందుకు వారిని కారుతో ఢీకొట్టాడు.
ఎర్రగడ్డకు చెందిన ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ , అతని భార్య మారియా మీర్ తో కలిసి బైక్‌పై డిసెంబర్ 18న అర్ధరాత్రి సమయంలో మాదాపూర్ మీదుగా గచ్చిబౌలి బయల్దేరారు. వీరితోపాటు సయ్యద్ మిరాజుద్దీన్, రాషెద్ మాషా ఉద్దీన్ అనే వ్యక్తులు కూడా మరో బైక్‌పై మాదాపూర్ వంతెన మీదుగా గచ్చిబౌలికి వెళ్తున్నారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో మిరాజుద్దీన్, రాషెద్ మాషా ఉద్దీన్‌లు ప్రయాణిస్తున్న బైక్‌పై నీళ్లు పడ్డాయి. దీంతో వారు కారును వెంబడించి.. డ్రైవర్‌ను నీళ్లెందుకు చిమ్మావు.. నెమ్మదిగా వెళ్లొచ్చుకదా అని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన రాజసింహారెడ్డి కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీన్ని గమనించిన సైఫుద్దీన్, మారియా మీర్ దంపతులు కారు డ్రైవర్‌ను వెంబడించి ప్రశ్నించారు. దీంతో రాజసింహారెడ్డి వారిని కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలపాలైంది. మారియాను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ డిసెంబర్ 21 తెల్లవారుజామున మృతి చెందింది. మారియాకు 8 నెలల పాప ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..