Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyaan Dhev: ‘అవతలి వాళ్లను క్షమించడం.. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను’.. వైరలవుతున్న కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. ఆయన నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి.

Kalyaan Dhev: 'అవతలి వాళ్లను క్షమించడం.. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను'.. వైరలవుతున్న కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్..
Kalyaan Dhev
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2023 | 8:10 AM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కళ్యాణ్ దేవ్. ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరోకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. ఆయన నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. నటుడిగా పేరు సంపాదించుకున్న ఈ హీరో.. హిట్స్ మాత్రం రాలేదు. ఇక సినిమాలు కాకుండా.. ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే నెట్టింట వైరల్ అయ్యారు. ఇటీవల ఆయన షేర్ చేస్తున్న ప్రతి పోస్ట్ క్షణాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా.. కళ్యాణ్ దేవ్ చేసే ప్రతి పోస్ట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతుల మధ్య విబేధాలు వచ్చినట్లుగా కొంతకాలంగా నెట్టింట టాక్ నడుస్తోంది. ఇద్దరూ వేరుగా ఉంటున్నారని కూడా అంటున్నారు. కానీ ఈ వార్తలపై రెండు కుటుంబాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

ఇటీవలే కళ్యాణ్ షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ఓపికగా ఉండండి.. అన్ని ప్రార్ధనలకు సమాధానం దొరుకుతుంది అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అంత డెప్త్ ఉన్న పోస్ట్ పెట్టాడా అని ఆరాలు తీశారు. ఇక తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో ఆసక్తికర పోస్ట్ చేశాడు కళ్యాణ్.

ఇవి కూడా చదవండి

” ఈ 2022 ఏడాది చాలా నేర్చుకున్నాను. సహనం.. మెరుగుపరుచుకోవడం.. అవకాశాలు తీసుకోవడం.. రిస్క్ తీసుకోవడం.. నా తప్పుల నుంచి నేర్చుకోవడం.. వదిలిపెట్టడం.. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. నా కష్టకాలంలో భుజాన్ని అందించిన వారికి థాంక్స్. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ముఖ్యమైనది ఎంటంటే.. ప్రయత్నించడం… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈకొత్త సంవత్సరం శుభాకాంక్షలు ” అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ పోస్ట్ వెనక అర్థమేంటా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం చేసిన హీరోయిన్..
ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం చేసిన హీరోయిన్..
జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం
జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం
జైలర్ 2 స్టేటసేంటి.? ఆ పాత్రలు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా.?
జైలర్ 2 స్టేటసేంటి.? ఆ పాత్రలు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా.?
నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు..మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమా
నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు..మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమా
హనుమాన్ చాలీసా పఠన రహస్యాలు..మీ కోరికలు నెరవేరాలంటే ఇలా చదవండి..!
హనుమాన్ చాలీసా పఠన రహస్యాలు..మీ కోరికలు నెరవేరాలంటే ఇలా చదవండి..!
అలా మాట్లాడితే సహించేది లేదు..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
అలా మాట్లాడితే సహించేది లేదు..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. నార్త్‎లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా
సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. నార్త్‎లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా
అజిత్ వాట్సాప్ డీపీ లీక్ చేసిన హీరోయిన్..
అజిత్ వాట్సాప్ డీపీ లీక్ చేసిన హీరోయిన్..
Hyderabadలో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఓ వైపు ఎండ..మరో వైపు వర్షం
Hyderabadలో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఓ వైపు ఎండ..మరో వైపు వర్షం
లంచ్ బాక్స్ లోకి టేస్టీ పులావ్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
లంచ్ బాక్స్ లోకి టేస్టీ పులావ్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం