Samantha: సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయిన సమంత.. ‘వాటికోసం ఇదే సరైన సమయమంటూ’ పోస్ట్..

గత కొద్ది రోజులుగా విరామం తీసుకుంటున్న సమంత.. తాజాగా నెట్టింట ఆమె తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ.. ఆసక్తికర పోస్ట్ చేసింది.

Samantha: సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయిన సమంత.. 'వాటికోసం ఇదే సరైన సమయమంటూ' పోస్ట్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2022 | 6:26 AM

ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్న సామ్.. కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్స్‏కు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో సామ్ నటనకు ప్రశంసలు అందుకుంది. అటు సౌత్ లోనే కాకుండా.. నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న సామ్..తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. యశోద సినిమా అనంతరం సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయ్యంది. గత కొద్ది రోజులుగా విరామం తీసుకుంటున్న సమంత.. తాజాగా నెట్టింట ఆమె తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ.. ఆసక్తికర పోస్ట్ చేసింది.

“మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. అలాగే కొత్త, సులభమైన లక్ష్యాల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్ధేశించుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023” అంటూ స్మైల్ ఇస్తున్న ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఆమెకు పలువురు కొత్త శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యశోద తర్వాత సామ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సామ్ కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. షూటింగ్ కు దూరంగా ఉంటున్నారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.