AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagachaitanya: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగచైతన్య.. ప్రపంచవ్యాప్తంగా కస్టడీ గ్రాండ్ విడుదల అప్పుడే..

చైతూ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా

Nagachaitanya: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగచైతన్య.. ప్రపంచవ్యాప్తంగా కస్టడీ గ్రాండ్ విడుదల అప్పుడే..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2022 | 6:38 AM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రంలో చైతూ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చేసిన “కస్టడీ” టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి క్యూరియాసిటీని పెంచారు. తాజాగా మేకర్స్ “కస్టడీ” థియేట్రికల్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ చిత్రాన్ని మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా
పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా
మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌
మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌
250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్
250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరు సినిమాపై ఖుష్బు రివ్యూ
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
నిజాయితీకి దక్కిన గౌరవం.. పారిశుధ్య కార్మికురాలికి గోల్డ్‌‌చైన్
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
కల్కి 2లో హీరోయిన్‌గా సాయి పల్లవి దాదాపు ఫైనల్ వీడియో
కేదార్‌నాథ్‌‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్‌.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.
కేదార్‌నాథ్‌‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్‌.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.
ప్రియుడితో నవ వధువు పరార్‌.. భర్త, పెళ్లి పెద్ద ఆత్మహత్య!
ప్రియుడితో నవ వధువు పరార్‌.. భర్త, పెళ్లి పెద్ద ఆత్మహత్య!
మొన్న చిరు.. నిన్న పవన్.. నేడు శర్వానంద్..!
మొన్న చిరు.. నిన్న పవన్.. నేడు శర్వానంద్..!
హైటెక్ సిటీలో అర్ధరాత్రి గందరగోళం.. ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు
హైటెక్ సిటీలో అర్ధరాత్రి గందరగోళం.. ప్రమాదకరమైన బైక్ విన్యాసాలు